వార్తలు

దేశంలో ఎరువుల కొరత లేదు…

0
mansukh mandaviya

No Shortage Fertilizers దేశంలో ఎరువుల లభ్యత, సరఫరాపై కేంద్రం రివ్యూ నిర్వహించింది. ఎరువులు రసాయన శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో 18 రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో DAP, యూరియా లభ్యత మరియు తాజా పరిస్థితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాయి. ఈ సందర్భంగా దేశంలో ఎరువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, సరిపడా లభిస్తుందని అన్నారు మంత్రి మన్సుక్‌ మాండవీయ. ఇక యూరియా పరిశ్రమల బ్లాక్ మార్కెట్ కి తరలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరీ ముఖ్యంగా భూముల్లో ఉన్న సారాన్ని రక్షించి ఎక్కువ ఉత్పాదకత లభ్యం అయ్యే నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువుల కోసం అన్ని విధాలా కృషి చేయాలని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మన్సుక్‌ మాండవీయ పిలుపునిచ్చారు.

mansukh mandaviya

DAP కోసం రైతుల దగ్గర నుండి విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. అయితే రైతుల డిమాండ్ ను అధికమించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సంహకరించడం అభినందనీయం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషి ఫలితంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరిగిందన్నారు. ఎరువులపై ప్రత్యేక డ్యాష్‌బోర్డు, వివిధ జిల్లాల్లో ఎరువుల లభ్యత, రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమర్థవంతమైన సమన్వయం కోసం 24గం.లు పని చేస్తున్న కంట్రోల్ రూమ్ ఏర్పాటు గురించి రాష్ట్ర మంత్రులకు మ‌న్సుక్ మాండ‌వీయ వివ‌రించారు. No Shortage Fertilizers Says minister mansukh mandaviya

fertilizers

రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా ఎరువులను సరఫరా చేస్తున్న‌ద‌ని, రోజువారీ సాధారణ పర్యవేక్షణ, మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేక యంత్రాంగం పని చేస్తున్న‌ద‌ని మాండవీయ తెలిపారు. ప్రధాని ఆదేశాల మేరకు ఎరువులపై సబ్సిడీని అందజేయడం ద్వారా రాష్ట్రాల‌కు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయ‌న చెప్పారు. ఇదిలావుంటే వివిధ జిల్లాల్లో సమృద్ధిగా ఎరువుల‌ నిల్వలు ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో ఇంకా ఉపయోగించకుండా ఉండిపోయాయని ఈ సంద‌ర్భంగా కేంద్రప్ర‌భుత్వ‌ అధికారులు తెలిపారు.

Leave Your Comments

ఐదవ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ సదస్సు

Previous article

నూనె ధరలు మరింత తగ్గనున్నాయా ?

Next article

You may also like