వార్తలు

రైతుని మించిన శాస్త్రవేత్త లేరు…

0
No Scientist Beyond The Farmer

No Scientist Beyond The Farmer సామజిక అంశాలపై సినిమాలు తీస్తూ మట్టి మనిషిగా జీవించే ఆర్.నారాయణ మూర్తి ఇటీవలే రైతన్న సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు. రైతుల సమస్యలు, కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు, మద్దతు ధర తదితర అంశాలను రైతన్న సినిమాలో చేర్చారు. దీంతో రైతన్న సినిమాని ప్రజలు విశేషంగా ఆదరించారు. అటు రాజకీయా నాయకులు రైతన్న సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఆర్. నారాయణ మూర్తి రైతు సమస్యలపై స్పందించారు.

R narayana murthy

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. రైతులని మించిన శాస్త్రవేత్తలు ( No Scientist Beyond The Farmer ) లేరని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆర్. నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. వ్యవసాయం దండుగ కాదని, వ్యవసాయం రైతుకి పండుగ అన్నారు మూర్తి. ఇక ఇటీవల కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలపై స్పందించిన మూర్తి రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని చెప్పారు. అలాగే సాగు చట్టాల వల్ల రైతులకి ఎన్ని విధాలుగా నష్టం కలిగిస్తుందో రైతన్న సినిమాలో స్పష్టంగా చూపించామని అన్నారు. ఇక వ్యవసాయ సాగు చట్టాల రద్దు మాత్రమే కాకుండా విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. R Narayana Murthy

R narayana murthy

ఎంఎస్‌ స్వామినాథన్ కమిషన్ ( MS Swaminathan Commission ) చేసిన సిఫార్సులను అమలు చేస్తే రైతులకు 50 శాతం లాభం చేకూరుతుందన్న మూర్తి రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు వెంకటస్వామి, మధుసూదన్ బాబు, ఇక్బాల్ పాషా ప్రభాకర్, ఆలూరు ప్రకాష్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments

ఆదర్శ మహిళ రైతు కథ..

Previous article

డాక్టర్ వి.ప్రవీణ్ రావుపై ప్రశంసలు

Next article

You may also like