వార్తలు

రైతన్నకు షాక్.. పంట కొనం – సీఎం కేసీఆర్

0
No Paddy Centres In Telangana
  • యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు.

  • కేంద్రం కొనడం లేదు.

  • కేంద్రం బియ్యం కొంటేనే రాష్ట్రం సేకరిస్తది

  • వానకాలం పంట మొత్తం కొనకుంటే బీజేపీ ఆఫీస్‌లో, ఇండియా గేట్‌ దగ్గర పోస్తం

  • కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరిక

  • తెలంగాణ రైతులను ముంచాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది

No Paddy Centres In Telangana In Rabi Season తెలంగాణాలో యాసంగి పంట కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. యాసంగి కొనుగోలు కేంద్రాలు ఉండవని తేల్చేశారు సీఎం. గత కొద్దీ రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతున్న యాసంగి పంట కొనుగోలుపై క్లారిటీ వచ్చేసింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ముందునుంచి చెప్తున్నమాట. అయితే ఎలా అయినా కేంద్రంతో పంట కొనుగోలు చేపిస్తామని తెలంగాణ అధికారపక్షం కేంద్రంతో ఫైట్ చేసింది. కాగా కేంద్రం స్పష్టమైన క్లారిటీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇక యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవంటూ ముఖ్యమంత్రి చెప్పారు.

no paddy parchase

ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ వరి ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడారు. కేంద్రం ధాన్యం సేకరిస్తేనే రాష్ట్రం కొనుగోలు చేస్తుందన్నారు సీఎం. రాష్ట్రానికి ధాన్యాన్ని నిల్వచేసే శక్తి ఉండదన్న సీఎం కేంద్రం పంట కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొని ఎక్కడ నిల్వ చేస్తుంది అని అన్నారు. మనకి గోదాములు లేనందున ధాన్యాన్ని నిల్వ చేసే అవకాశం ఉండదు. ధాన్యాన్ని నిల్వ చేయడానికి దానికంటూ ఓ శాస్త్రీయత ఉంటుంది. దాన్ని పిరియాడికల్ గా నిల్వ చేయాలి. ఆ టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు సీఎం. మన తెలంగాణకే కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ అవకాశం లేదని స్పష్టం చేశారాయన. ముందు జాగ్రత్తగా ఇప్పుడే చెప్తున్నా… ఇప్పుడు చెప్పకపోతే పంట చేతికొచ్చిన తర్వాత ..అయ్యో ముందే చెప్తే మేము వేరే పంట వేసుకుందుము కదా సారూ అంటారు పాపం అమాయక రైతులు, అందుకే ముందే చెప్తున్నా యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు అని అన్నారు సీఎం కేసీఆర్.

 

kcr vs modi

CM KCR దేశంలో ఆహార ధాన్యాల‌ను సేక‌రించ‌డం.. సేక‌రించిన ధాన్యాన్ని ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా పేద‌ల‌కు అందించ‌డం.. అలాగే దేశ ఆహార భ‌ద్ర‌త కోసం బ‌ఫ‌ర్ స్టాక్స్ నిలువ చేయ‌డం, సేక‌రించిన ధాన్యంలో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి ఆహార కొర‌త ఏర్ప‌డ‌కుండా.. ఆహార ర‌క్ష‌ణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం బ‌ఫ‌ర్ స్టాక్స్‌ను మెయిన్‌టెన్ చేస్తాయి. ఆ త‌ర్వాత‌ ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు ఆహార ధాన్యాల‌ను అందించి నిరుపేద‌ల‌కు అందించ‌డం.. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగ బ‌ద్ధంగా కేంద్రం మీద ఉన్న బాధ్య‌త‌. వానకాలంలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనకపోతే బీజేపీ ఆఫీస్‌లో లేదా ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు పారబోస్తం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం కెసిఆర్

No Paddy Centres In Telangana

No Paddy Centres In Telangana

యాసంగి ధాన్యం కొనాలని మేము కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేశాం. నేను పేగులు తెగేదాకా కొట్లాడిన. మూడునాలుగు సార్లు నేను ఢిల్లీకి పోయిన. ప్రధానికి చాలా సందర్భాల్లో చెప్పిన, లేఖలు రాసిన, ఇటీవల ధర్నా నుంచి ప్రధానికి ఓపెన్‌ లెటర్‌ రాసిన. ఒక్కసారి కూడా సమాధానం రాలేదు. రాష్ట్ర అధికారులు కనీసం 15 సార్లు ఢిల్లీకి పోయిన్రు. వ్యవసాయ, పౌరసరఫరాలశాఖల మంత్రుల నాయకత్వంలో మంత్రివర్గ బృందం, ఎంపీలు ఆరుసార్లు పోయిన్రు. విమానం ఖర్చులు దండుగైపోయినయి తప్ప లాభం లేదు. కేంద్రానికి ఇంతనన్న సిగ్గుండాలి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కంటే దారుణమైన స్థానంలో భారత్ ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 116 దేశాల్లో 101వ స్థానం భారత్‌ది.పాకిస్తాన్ 92 ఉంది మన దేశ పరిస్థితి మొహం మీద ఉమ్మేసే విధంగా ఉంది. కేంద్రమంత్రి పియూష్‌ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. Paddy Procurement Issue

no paddy parchase

Telangana Agriculture ఏడేళ్ల కిందట తెలంగాణ రైతు పరిస్థితి ఏంది? ఈరోజు తెలంగాణ రైతు పరిస్థితి ఏంది? ఏడేళ్ల కిందట తెలంగాణ పల్లెల్లో ఎంత డబ్బు ఉంది? ఇప్పుడు ఎంత డబ్బు ఉంది? తెలంగాణ భూముల ధరలు ఎక్కడికి పోయినై? చాలామంది తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి అన్నారు. పడిపోయినయా పెరిగినయా? రూ. 20 లక్షల లోపల (ఎకరం) భూమి దొరుకుతుందా ఇయ్యాల తెలంగాణలో ఎక్కైడనా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ వాల్యూ.. తెలంగాణ రైతు వాల్యూ? ఐదెకరాలు ఉన్న తెలంగాణ రైతు ఇయ్యాల కోటీశ్వరుడు. అదే ఏడేండ్ల కిందట.. బిచ్చగాడు. వలస బోయిండు. పోలే.. మనం జూళ్లే.

cabinet meeting

కాగా.. మీడియా సమావేశంలో సీఎం కెసిఆర్ కరోనా వేరియంటేషన్ పై మాట్లాడారు… కరోనా కొత్త వేరియన్ ఒమిక్రాన్ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్దతను సమీక్షించిన మంత్రివర్గం… ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. అందరూ టీకాలు తీసుకునేలా చూడాలని, వ్యాక్సినేషన్ పై మంత్రులు ఆయా జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించింది. టీకా తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్న ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శిని మంత్రివర్గం ఆదేశించింది. కొత్త వేరియంట్ సన్నద్దత, నియంత్రణా చర్యలు, వ్యాక్సినేషన్​పై వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబిత ఇంద్రారెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. చివరిగా వ్యవసాయ చట్టాల ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతు కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

Omicron India 

Leave Your Comments

రైతుల సమస్యలు పార్లమెంటుకి పట్టవా..?

Previous article

1.20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం – తెలంగాణ ప్రభుత్వం

Next article

You may also like