వార్తలు

మోడీ నిర్ణయం హుందాగా ఉంది..

0
Niranjan Reddy Reacts On Cancellation Of 3 Farm Laws
Niranjan Reddy Reacts On Cancellation Of 3 Farm Laws

Niranjan Reddy reacts on cancellation of 3 farm-laws:దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాల అంశం మారుమ్రోగుతుంది. ఏడాదికాలంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మోడీ కీలక నిర్ణయంపై పలువురు మేధావులు వారి వారి అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా మోడీ చారిత్రాత్మక ప్రకటనపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు.

Niranjan Reddy Reacts On Cancellation Of 3 Farm Laws

Niranjan Reddy Reacts On Cancellation Of 3 Farm Laws

సాగు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ రైతులకి క్షమాపణ చెప్తూ సదరు చట్టాలను రద్దు చెయ్యడం హుందాగా ఉంది. అయితే ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటె బాగుండేది. ఏదేమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక వణికించే చలిలోనూ ఉద్యమం చేసిన రైతు సోదరులకు అభినందనలు తెలియజేస్తూ… అసువులుబాసిన రైతులకు కన్నీటి నివాళులర్పిస్తున్నామని చెప్పారు మంత్రి.

KCR and Modi

Telangana Chief Minister KCR

ప్రజలకు అనుగుణంగా పాలకులు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రజల అభిప్రాయానికి మించి మరేదాన్ని పాలకులు ప్రామాణికంగా తీసుకోవడానికి వీళ్లేదన్నారు. అదేవిధంగా తెలంగాణ రైతులు నిరసనలు కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుందని, సీఎం కెసిఆర్ పోరాటం గురించి ప్రధానికి తెలుసనీ.. తెలంగాణాలో రైతుల ఉద్యమం ఉదృత రూపం దాల్చకముందే యాసంగి వరి కొనుగోళ్లలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.

To Day Latest Updates : eruvaaka

 

Leave Your Comments

వ్యవసాయ చట్టాలు రద్దు… కానీ… !

Previous article

వ్యవసాయ చట్టాల రద్దుపై తెలంగాణ మంత్రుల కామెంట్స్…

Next article

You may also like