TS Agricultural Minister: ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో రైతన్నలు విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా పంట నాశనం అయింది. ఆరుగాలం పండించిన నీటమునగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు.ఈ మేరకు పంట నష్టంపై తెలంగాణ సర్కారు ద్రుష్టి పెట్టింది. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రులు వరంగల్ జిల్లాలలో పర్యటన చేపట్టారు.
వరంగల్ జిల్లాలోని పరకాల – నర్సంపేట సబ్ డివిజన్లలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు బృందం పర్యటించింది. వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను మంత్రులు పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. కాగా పంట నష్టపోయిన రైతులు మంత్రులను చూసి భోరుమన్నారు. తమ గోడును మంత్రులతో చెప్పుకున్నారు. ఈ మేరకు పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.
Also Read: అన్నదాతల అప్పుల బాధలు తీర్చింది కేసిఆరే: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy)మాట్లాడుతూ.. అకాల వర్షాలు రైతన్నల పాలిట శాపంగా మారింది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన మిరప నేలరాలిందని, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథని ప్రాంతాల్లో మిర్చి దెబ్బతిన్నదని మంత్రి చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంటనష్టం పరిశీలిస్తున్నామని, నష్టపోయిన రైతుల పంటల వివరాలు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేసేవిధంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు మంత్రి. పర్యటన అనంతరం పంట నష్టంపై సీఎం కేసీఆర్ దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామన్నారు.
ఈ పర్యటనలో మంత్రులతో కలిసి రైతు సమన్వయ బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా దర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
Also Read: పంట నష్టపోయిన వరంగల్ రైతులను పరామర్శించనున్న సీఎం కేసీఆర్