మన వ్యవసాయంవార్తలువ్యవసాయ వాణిజ్యం

నాణ్యమైన మల్చింగ్‌తో నవరత్నాలు

0

నల్గొండ జిల్లా, చౌటుప్పల్‌ మండలం, రాచకొండ గుట్టల పాదాలచెంత పవిత్ర దేవతామూర్తి సరళ మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో  ఆగష్టు 27వ తేదీన చౌటుప్పల్‌ ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం, అన్నదాత పెస్టిసైడ్స్‌ సంస్థల ఆద్వర్యంలో రైతుల విజ్ఞాన శిబిరం జరిగింది. నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఇంజనీరింగ్‌ విభాగం మరియు నెటాఫిమ్ బిందు సేద్య సంస్థ సాంకేతిక నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని వివిధ పంటలలో మల్చింగ్‌ మరియు బిందు సేద్య పద్ధతుల గురించి వివరించారు. నోవా అగ్రిటెక్‌ అగ్రి ఇంజనీరింగ్‌ నిపుణుడు బి. కళ్యాణచక్రవర్తి ప్రసంగిస్తూ తగిన పరిమాణంతో ఉన్న మల్చింగ్‌ను పరచడం వలన కలిగే లాభాలను వివరించారు. మొక్కలపై అల్ట్రావైలెట్‌ కిరణాల ప్రభావాన్ని నిరోధించే సాంకేతిక పటిష్టతతోనూ, అంతర్జాతీయ ప్రమాణాలతోనూ, తయారుచేసిన నోవా మల్చితో నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చునని తెలిపారు. క్షేత్రస్థాయిలో తుంగజాతి కలుపు కొన్ని చోట్ల మల్చి పరచిన ప్రత్యక్షమవడాన్ని రైతులు సభదృష్టికి తీసుకువచ్చారు. అయితే రంగుల మల్చిని వినియోగించేటప్పుడు తగిన పరిమాణాన్ని నిర్ధారిస్తూ, మల్చిపరచేటప్పుడు షీటును సాగదీయకుండా చూసుకోవాలని, దానికి తగిన సాంకేతిక జాగ్రత్తలను తీసుకోవాలని ముఖ్యంగా పలుచని మల్చిషీటును వినియోగించుకోవాలని కోరారు. రజిత, నలుపు కలసి ఉన్నప్పుడు నలుపు రంగు వెనుకకు కనబడకుండా ఉంటే అది నాణ్యమైన షీటుగా పరిగణించవచ్చునని తెలిపారు.

చేతితో ప్రత్తి తీసే యంత్రంపై ఆసక్తి !!!!!!

నోవా అగ్రిటెక్‌ కంపెనీ ప్రత్తి తీత సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాటన్‌ హ్యాండ్‌పిక్కర్‌ను 2011 ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి మార్కెట్‌కు పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ శిబిరంలో రైతులు ఈ యంత్రం పనితీరు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. యంత్రం పని విధానం, సామర్ధ్యం గురించి కళ్యాణ్‌ విపులంగా వివరాంచారు. అంతకుముందు ఇటువంటి యంత్రం వలన ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగైన ప్రమాణాలతో కలుషితం లేని స్వచ్ఛతగల ప్రత్తిని సునాయాసంగా, తక్కువ ఖర్చుతో ఎలా ఏరవచ్చో వివరించారు. సెప్టెంబరు నెలాఖరు వరకు ఈ కంపెనీ అధీకృత డీలర్లు, మార్కెటింగ్‌ అధికారుల వద్దకు యంత్రాలు చేరుకోగలవని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గ్గొన్న నెటాఫిమ్‌ మేనేజర్‌ ఎన్‌.ఎస్‌ సుబ్బారావు ప్రసంగిస్తూ బిందు సేద్యం వలన రైతులకు కలిగే లాభాలు, సులభతరంగా చేసుకోదగిన ఎరువులు, పోషకాల యాజమాన్యం గురించి వివరించారు. ప్రత్తి, మిరప పంటలలో డ్రిప్‌తో అనుసంధానమైన మల్చింగ్‌ ప్రక్రియలను కూడా ఆయన వివరించారు.

ఉమ్మడి వ్యవసాయంపై అమితాసక్తి !!!!!!!!

నల్గొండ జిల్లా వ్యవసాయపరంగా వెనుకబడిన జిల్లా.  నాగార్జున సాగర్‌ ఎడమకాలువ పుణ్యమా అని ఆ జిల్లాలో లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. రైతులలో వచ్చిన చైతన్యంతో నాగార్జునసాగర్‌ రోడ్డును ఆనుకుని ప్రస్తుతం బత్తాయి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వేరుకుళ్ళు తెగులు సోకడం, గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిలలాడారు. ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితులు కొంత అనుకూలించడంతో అక్కడ పరిస్థితి మెరుగైంది. సాగు రంగంలో వచ్చిన చైతన్యం, ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలోని ముల్కనూరు, నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని కౌట్ల`బి సొసైటీలు పరస్పర సహకార రంగంలో చేసిన వినూత్న ప్రయోగాలు, సంక్షోభంలో ఉన్న రైతులను గట్టెక్కించి, సహకార పధంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ప్రక్రియలకు చిట్యాల రైతులు ఎంతో ఆకర్షితులైనారు. కొంతం సత్యన్నారాయణ రెడ్డి నాయకత్వంలో పరస్పర సహకార పరపతి సంస్థను ఏర్పాటు చేసుకొని 30 ఎకరాలలో ఉమ్మడి వ్యవసాయాన్ని ప్రారంభించారు. 13 ఎకరాలలో ప్రయోగాత్మకంగా డ్రిప్‌, మల్చింగ్‌ వంటి ఆధునిక పరిజ్ఞానంతో ఖర్బూజా (మస్క్‌మిలన్‌) పండిస్తూ, అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలలో ఖర్బూజాకు ఎల్లవేళలా డిమాండ్‌ ఉండడంతో గిట్టుబాటు ధరలు లభించి సొసైటీలోని రైతులు సానుకూల వ్యవసాయ ప్రక్రియలతో ముందుకు వెళుతున్నారు. మిగిలిన 17 ఎకరాలలో వివిధ రకాలైన కూరగాయ పంటలను పండిరచడానికి సన్నాహాలు ప్రారంభమైనాయి. రాచకొండరైతు శిబిరంలో ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో పండించిన నాణ్యమైన, నిగారింపుతో కూడిన, రుచికరమైన ఖర్బూజా ఫలాలు విశేషంగా ఆకర్షించాయి.

Leave Your Comments

Turmeric Cultivation: పసుపు పంటకు పురుడుపోస్తున్న తెలుగు రైతు శాస్త్రవేత్తలు

Previous article

ప్లాస్టిక్ మల్చింగ్ యొక్క ప్రయోజనాలు – సమగ్ర యాజమాన్య పద్ధతులు

Next article

You may also like