Onion Price: వర్షాకాలం మొదలు అయ్యాక మూడు వారాల తర్వాత వర్షాలు పడ్తున్నాయి. భారతదేశంలో కొన్ని రాష్ట్రలో చాలా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. మూడు వారాల ఆలస్యంగా మొదలు అయి, భారీగా వర్షాలు రావడం మళ్ళీ రైతులని ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎక్కువ వర్షాలు కురవడం వల్ల కూరగాయల ధరలు ఆకస్మికంగా పెరుగుతున్నాయి.
తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రలో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కూరగాయల్లో టమాటా ధర కిలో 100 రూపాయలు ఉంది. రాబోయే రోజులో ఈ ధర 150 రూపాయలు అయిన ఆశ్చర్యం ఏమి లేదు. మిరప కాయల ధర కిలో 200 రూపాయలు ఉంది. ఏ కూరగాయలు అయిన కిలో 80 రూపాయలు ఉన్నాయి.
Also Read: Jafra Cultivation: ఈ చెట్లు పెంచడం వల్ల రైతులకి మంచి లాభాలు..
ఈ కూరగాయల ధర పెరగడానికి ముఖ్యంగా ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉండటం వల్ల ఆ వేడికి పంటలు దెబ్బతినడం. వర్షాకాలం ప్రారంభంలో కాకుండా జులై నెలలో ఎక్కువ వర్షాలు కురవడం. ఎక్కువ వర్షాల వాళ్ల రైతులు కూరగాయాలని సాగు చేయకపోవడం. దాని వల్ల ధరలు పెరిపోతున్నాయి.
గత రెండు రోజుల నుంచి ఉల్లిపాయల ధర కూడా టమాటా ధర వైపుగానే సాగుతుంది. ఇంకో నెల రోజులో ఉల్లిపాయల కూడా కిలో 100-150 రూపాయికి వస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల ఉల్లిపాయల పంట దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయల వ్యాపారులు నిల్వ కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టారు.
Also Read: Long Special Cultivator: వరి పొలం దున్నడానికి కొత్త నాగలి…