జాతీయం

Prime Minister’s Employment Generation Programme: PMEGP పథకానికి అర్హులు ఎవరు..?

2
Prime Minister's Employment Generation Programme
Prime Minister's Employment Generation Programme (PMEGP)

Prime Minister’s Employment Generation Programme: చిన్న, మధ్య తరహా ప్రరిశ్రమలు మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఎంప్లోయమెంట్ జనరేషన్ ప్రోగ్రాంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మొదలు పెట్టారు. ఈ పథకం ద్వారా 25 లక్షల వరకు రుణాలు ప్రభుత్వం చిన్న, సూక్ష్మ కుటీర, మధ్యతరహా పరిశ్రమలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇస్తుంది.

కానీ పరిశ్రమ మొదలు పెట్టాలి అనుకునే వారి వయసు 18 ఏళ్లు పూర్తి చేసుకొని ఉండాలి. కనీసం 8వ తరగతి చదివి ఉండాలి. ఈ PMEGP పథకం ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణం ఇస్తారు.

మీరు మొదలు పెట్టె పరిశ్రమ బట్టి 10-25 లక్షల వరకు రుణాలను తీసుకోవచ్చు. జనరల్ కేటగిరి వాళ్ళు పెట్టుబడిలో కేవలం 90 శాతం మాత్రమే రుణం పొందవచ్చు. మిగిలిన 10 శాతం వారే సొంత పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకి 95 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. మిగిలిన 5 శాతం సొంత పెట్టుబడితో పరిశ్రమ ప్రారంభించుకోవాలి.

Also Read: French Beans Farming: అధిక లాభాలు తెచ్చిపెడుతున్న ఫ్రెంచ్ బీన్ సాగు విధానం..

Prime Minister's Employment Generation Programme

Prime Minister’s Employment Generation Programme

స్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, వికలాంగులు ప్రారంభించే పరిశ్రమకి 35% గ్రామీణ ప్రాంతాల్లో , 25% పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ వస్తుంది. జనరల్ కేటగిరీలో వాళ్ళకి 25-15% సబ్సిడీ వస్తుంది. కానీ ఈ సబ్సిడీ పొందాలి అంటే తీసుకున్న రుణాన్ని మూడు సంవత్సరాల వరకు సక్రమంగా కట్టాలి.

మీరు తీసుకునే రుణానికి బ్యాంకు బట్టి వడ్డీ రేట్ మారుతుంది. ఈ పథకానికి దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. kviconline.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ప్రారంభించే పరిశ్రమని బట్టి ప్రభుత్వం నెల రోజులు శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో తప్పనిసరిగా తీసుకోవాలి.

ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి పాస్పోర్ట్ సైజు ఫోటో, అడ్రస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ సర్టిఫికేట్. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ని వెబ్సైట్లో చూసుకోవచ్చు. సిగరెట్, బీడీ, తేయాకు, కాఫీ, రబ్బరు, సెరీ కల్చర్, హార్టీ కల్చర్ సంబంధించిన వాళ్ళకి ఈ పథకం వర్తించదు.

Also Read: Golden Berry Cultivation: గోల్డెన్ బెర్రీ సాగు లక్షలు తెచ్చిపెడుతోంది..

Leave Your Comments

Tractor Platform Trolley: గడ్డి తీసుకొని వెళ్ళడానికి కొత్త పరికరం..

Previous article

Bottle Gourd Cultivation Income: సొరకాయ సాగులో ఎక్కడి రైతులకి మంచి లాభాలు.!

Next article

You may also like