జాతీయం

QR Code System for Quality Seeds: నాణ్యమైన విత్తనాల కోసం -QR కోడ్ సిస్టమ్.!

0
QR Code System for Quality Seeds
QR Code System for Quality Seeds

QR Code System for Quality Seeds: వర్షాకాలం వచ్చేస్తుంది రైతులు పంట పొలాలు దున్ని, విత్తనాల కోసం ఎదురు చూస్తుంటారు.రైతులు ఏ పంట వేయాలి ఏ విత్తనం వేస్తే పంట బాగా వస్తుందని ఆలోచిస్తుంటారు. రైతులు వేసే విత్తనాలు అన్ని మొలకెత్తుతున్నాయా?. రైతులకు వ్యాపారుల దగ్గర కొనే విత్తనాల్లో కొన్ని నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి. ఈ నకిలీ విత్తనాలు వేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు కొని పంట పండక ఎంతో మంది రైతులు చనిపోయారు. రైతులు నకిలీ విత్తనాలకీ, మంచి విత్తనాలకీ తేడా గుర్తుపటేందుకు విత్తనాల ప్యాకెట్ పై క్యూఆర్ కోడ్ సిస్టమ్ (ట్రేసబిలిటీ) లేబుల్ ముద్రించబడి ఉంటుంది.

QR Code System for Quality Seeds

QR Code System for Quality Seeds

మన దేశంలో అనేక విత్తన కంపెనీలు హైబ్రిడ్, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు అన్ని మార్కెట్‌లో రైతులందరికి అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికి కొంతమంది విత్తన డీలర్ల నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసంచేస్తున్నారు. ఈ డీలర్ల దగ్గర విత్తనాలు కొన్నతర్వాత రసీదు రైతులకి ఇవ్వరు. ఇటువంటి మోసాలనుండి నుంచి జాగ్రత్తగా ఉండటానికి ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ (ట్రేసబిలిటీ) అందుబాటులోకి వచ్చింది. విత్తన డీలర్ల దగ్గర క్యూఆర్ కోడ్‌లు లేదా ట్రేస్‌బిలిటీ లేని విత్తనాలను కొనడం నిషేధించాలి. విత్తనాలు కొన్న తరువాత బిల్లులను పాయింట్-ఆఫ్-సేల్ (POS) ప్రకారం ఇవ్వమని అడగాలి . పాయింట్-ఆఫ్-సేల్ (POS) ప్రకారం విత్తనాలను కొనుగోలు చేయడం వలన విత్తన ఎదుగుదల, పంటలలో నకిలీ విత్తనాలను గుర్తించవచ్చు.

Also Read: Pests in Chilli: మిరపలో వచ్చే తెగుళ్ల గురించి తెలుసుకుందాం.!

కేంద్ర ప్రభుత్వం రైతులకి మంచి విత్తనాల లభించడంలో, బిల్ ఉంటేనే విత్తనాలు కొనుగోలు చేయడానికి వీలు అయ్యేలా కొత్త రూల్స్ తీసుకొని రావాలి. భారత ప్రభుత్వం రైతులకి సరైన విత్తనాలు అందించడానికి ఒక అభ్యర్థిని పెట్టాలి. నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మంచి విత్తనాలు రైతులకి అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రసిద్ధి చెందాయి. గ్లోబల్ సీడ్ హబ్‌గా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. 450 సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, విత్తనాలు ప్రాసెస్, ప్యాకింగ్, ఉత్పత్తి వరకూ అధికారులు దగ్గర ఉండి పరీక్షిస్తారు. సీడ్ ప్రాసెసింగ్ మొత్తం యంత్రాలతో చేస్తారు. విత్తన నాణ్యతను పరిశీలించడానికి టాస్క్‌ఫోర్స్,వ్యవసాయ శాఖ నుండి విత్తన చట్టాన్ని అమలు చేసిన అధికారులు ప్రత్యేక బృందాలు ఉన్నాయి.

QR Code System for Quality Seeds

QR Code System for Quality Seeds

వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు నుంచి పంట శాస్త్రవేత్తలు, విత్తన పంట అభివృద్ధిని ప్రతి దశలలో విత్తన కంపెనీల R&D విత్తన క్షేత్రాలను పరిశీలన చేయాలి. NGOలు నిర్వహించే రైతుల సభలు, రైతుల సమావేశాలకంటే ఈ విధానం రైతులకి చాలా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, కూరగాయల, వరి ఎక్కువ పండించే పంటలు, ముందుగా ఈ సీజన్ నుంచి ఈ పంటలకు క్యూఆర్ కోడ్‌లను తప్పనిసరి చేస్తే రైతులకి ఉపయోగపడుతుంది. వీటి ఫలితాలని చూసి మిగితా పంటలకీ కూడా క్యూఆర్ కోడ్‌ సిస్టమ్ పెట్టాలి.

Also Read: Snake Gourd Farming: పాము పంట పొట్లకాయ సాగు గురించి ఆసక్తికర విషయాలు.!

Leave Your Comments

Pink Garlic Cultivation: రైతుల పాలిట వరంగా మారుతున్న పింక్ వెల్లుల్లి.. భారీ ధర, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

PJTSAU: ఘనంగా జరిగిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం.!

Next article

You may also like