Sugarcane Farmers: ప్రస్తుత సీజన్‌లో రైతులకు 91 శాతం పైగా చెరకు బకాయిలు చెల్లించాలని కేంద్ర మంత్రి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.ప్రస్తుత చక్కెర సీజన్‌కు సంబంధించి జూలై 17 వరకు దాదాపు 91.16 శాతం చెరకు బకాయిలను రైతులకు చెల్లించినట్లు శుక్రవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. చెరకు రైతులకు బకాయిలు చెల్లించడానికి వీలుగా కేంద్రం ఎప్పటికప్పుడు విధానపరమైన చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి తెలిపారు.
కేంద్ర నిర్ణయాల ఫలితంగా, 2020-21 చక్కెర సీజన్ల వరకు దాదాపు 99.9 శాతం చెరకు బకాయిలు చెల్లించారు.గత సీజన్ 2021-22లో కూడా, 99.9 శాతం కంటే ఎక్కువగా చెరకు రైతుల బకాయిలు చెల్లించినట్టు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ వెల్లడించారు. ప్రస్తుత చక్కెర సీజన్ 2022-23 లో, జూలై 17 నాటికి దాదాపు 91.6 శాతం చెరకు బకాయిలు చెల్లించినట్టు ఆయన రాతపూర్వకంగా తెలిపారు. ప్రస్తుత చక్కెర సీజన్ 2022-23 అక్టోబర్-సెప్టెంబర్ వరకు చెరకు రైతులకు చెల్లించాల్సిన రూ.1.13 లక్షల కోట్లలో ₹1.03 లక్షల కోట్లు చెల్లించామన్నారు.
మిగిలిన రూ.9,499 కోట్ల బకాయిల్లో ఉత్తరప్రదేశ్‌లోని రైతులకు రూ6,315 కోట్లు, గుజరాత్‌లోని రైతులకు రూ.1,651 కోట్లు, మహారాష్ట్రలోని రైతులకు రూ.631 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని రాజ్యసభకు తెలిపారు. చక్కెర కర్మాగారాల చెరకు ధర చెల్లింపుల వివరాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అధికారాలు అప్పగించినట్టు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు.
Also Read: Paddy Bund Maker: ఈ పరికరం వాడితే రైతులకి 50 వేల రూపాయలపెట్టుబడి తగ్గుతుంది..