Pradhan Mantri Kisan Mandhan Yojana: రైతుల సమస్యలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలని తీసుకొని వస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఈ పథకాలు సహాయపడ్తాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ మధ్య కాలంలో ప్రతి రోజు ఒక పథకాన్ని ప్రకటిస్తుంది. ఇప్పుడు రైతుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు పొందవచ్చు. ఈ పథకం రైతులకి ఎంతో సహాయపడుతుంది.
ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన (Pradhan Mantri Kisan Mandhan Yojana) పథకం 60 ఏళ్లు నిండిన రైతులకి మాత్రమే ఇస్తున్నారు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి, ఆహార ప్రదాతలు నెలకి 55-200 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టడం వయస్సు పై ఆధార పడి ఉంటుంది. రైతులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరంలో రైతులు 2400 నుంచి 660 రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
Also Read: Plant Growth Hormones: మొక్కలో హార్మోన్ల ఉత్పత్తి వల్ల కలిగే లాభాలు ఏంటి.?
ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన పథకం ప్రయోజనాలు అని రకాల రైతులు పొందవచ్చు. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. కేవలం వ్యవసాయం పై ఆధార పడి ఆదాయం పొందే రైతులకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పింఛను తీసుకోవడానికి రైతులు సమీపంలో ఉన్న ఉమ్మడి కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాలి.
Also Read: Agri Youth Summit -2023: పీజేటీఎస్ఏయూ లో ఘనంగా ముగిసిన అగ్రి యూత్ సమ్మిట్ -2023