Pulses Price Hike: కూరగాయల ధరల పెరుగుదలతో బెంబేలెత్తిన ప్రజలకు తాజాగా పప్పుధాన్యాలు ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరల కంటే అధిక ధరలు రానున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి .దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిత్యం వాడుకునే పప్పులతో తిప్పలు తప్పవు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.
ఖరీఫ్, రబీ సీజన్ లలో పండిస్తారు..
రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మాదిరిగానే పప్పు దినుసులు ధరలు కూడా అధికంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. గత ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా పప్పు ధాన్యాల దిగుబడి తగ్గింది. అలాగే రుతుపవనాల ఆలస్యం వల్ల, మరికొన్ని రాష్ట్రాల్లో అధిక వర్షాల వల్ల పప్పు ధాన్యాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రభుత్వాలు మార్కెట్ పరిస్థితులను నిత్యం పరిశీలిస్తూ ధరల ఒడిదుడుకులను కట్టడి చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.
ధరల స్థిరీకరణ ద్వారా ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉండి ప్రజలపై ధరల భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక ,ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పప్పు ధాన్యాల పంటలు అధికంగా ఉంటాయి . ఇటీవల కాలంలో వర్షాభావం అధికంగా ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో వీటి పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కందిపప్పు, వేరుశనగ, పెసర, సోయాబీన్ వంటి పంటలకు నష్టం కలిగినట్లు తెలుస్తోంది.
పప్పుధాన్యాలపై పరిశోధనలు అవసరం
Also Read: Backyard Fruit Plants: ఇంటి పెరట్లో ఎలాంటి పండ్ల మొక్కలు వేసుకోవాలి.!
దేశంలో పప్పు ధాన్యాలు, వాటి పంటలపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిశోధన వల్ల నూతన వంగడాలను సృష్టించి ఉత్పాదకత పెంచుకునే అవకాశాలు ఉంటాయి. సాగు పద్ధతులు, నేల స్థితిగతులు, పంటకు వచ్చే తెగుళ్లు వాతావరణ ప్రభావాలు వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఆధునిక పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది . పప్పు ధాన్యాలు రబీ సీజన్ లో 60 శాతం ఉత్పత్తి జరుగుతోంది. ఇక దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అనిచ్చితి వల్ల , జనాభా పెరుగుదల కారణంగా వాటి తలసరి లభ్యతలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
రైతులను ప్రోత్సహించాలి
దేశంలో తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి నిచ్చే పంటల వృద్ధికి సంబంధించి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈక్రమంలో పప్పు ధాన్యాలు ఉత్పత్తిలో కూడా స్వయం సమృద్ధి సాధ్యపడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పంటకు సంబంధించి తక్కువ స్థాయి యంత్రాల వినియోగం, ప్రభుత్వ ప్రోత్సాహకం లేకపోవడం, మద్దతు ధరలు ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల పప్పు ధాన్యాలు, ఇతర వంగడాల సాగును రైతన్నలు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయం ప్రధానంగా కార్యకలాపాలు జరిగే విశ్వవిద్యాలయాలు ఇటువంటి పంటలపై ఆధునిక పరిశోధనలు చేసి దిగుబడిని పెంచేలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొత్త వంగడాలు వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా అధిక దిగుబడి నిచ్చేలా ఉండాలని మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతులకు హేతుబద్దమైన మద్దతు ధరలు ఇవ్వాలని, అతివృష్టి వల్ల గాని, అనావృష్టి వల్ల గాని రైతులు నష్టపోకుండా ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Also Read: India-Israel Agriculture: భారతదేశం, ఇజ్రాయెల్ వ్యవసాయంలో సత్ససంబంధాలు.!