Pulses Price: భారత దేశంలో ప్రధాన ఆహారంగా పప్పులు తింటారు. సామాన్య ప్రజలు అందరూ వీటిపైనే ఆధారపడి ఉంటారు. పప్పులో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్, పోషకాలు ఉంటాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారంగా మారేలా ఉంది. గత నెలతో పోలిస్తే ఈ నెల పప్పు ధరలు చాలా పెరిగింది. ఈ ధరలు రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇలా పప్పు ధరలు ఇంకా పెరుగుతూ పోతుంటే సామాన్యులు సంపాదించే సంపాదన మొత్తం వీటికే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
కనీసం నూనె ధరలు తగ్గుతాయి అనే ఆశతో ఉన్న ప్రజలు ఆకస్మికంగా పెరుగుతున్న ధరలు చాలా భారంగా అవుతున్నాయి. గత నెల కంది పప్పు ధర కిలో 90-100 రూపాయలు ఉంటే, ఇప్పుడు 160-170 రూపాయలకి పెరిగింది. ఎర్ర పప్పు కిలో 60 రూపాయలు ఉంటే, ఇప్పుడు 120 రూపాయలకి పెరిగింది. వేరే పప్పుల ధర కూడా చాలా పెరిగి ఇప్పుడు 150-160 మధ్యలో ఉంది.
Also Read: Tomato Price: పెరుగుతున్న కూరగాయల ధరలు.. కిలో టమాటా 100 రూపాయలు
ఆన్లైన్లో సరుకులు కొనుక్కునే ప్రజలు కూడా పెరిగిన ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆన్లైన్లో కూడా పప్పుల ధర 170-180 వరకు ఉంది. ఆర్గానిక్ పప్పు అయితే 250-280 రూపాయల వరకు ఉంది. ఇంకో కొద్దీ రోజులో రిటైల్లో కూడా పప్పుల ధర కిలో 200లకు పైగానే పెరుగుతుంది.
ఇలా ఆకస్మికంగా ధరలు పెరగడానికి ముఖ్య కారణం పంట దిగుబడి తగ్గడం, పంట చేతికి వచ్చే సమయానికి ఎక్కువ వర్షాలు కురవడం. పంట కోసిన తర్వాత కూడా ఎక్కువ వర్షాల వల్ల పంట మొలకలు రావడం ఇంకో కారణం. పప్పులు నిల్వ చేసుకోవడానికి సరైన కోల్డ్ స్తొరగె లేకపోవడం. ప్రభుత్యం కూడా విదేశాల నుంచి 100 క్వింటాల్ వరకు పప్పులు దిగుమతి చేసుకోవడం. ఈ పప్పుల ధరలు ఇలా పెరుగుతూ పోతే ద్రవ్యోల్బణం ఏర్పడే పరిస్థితి వస్తుంది.
Also Read: Rythu Bandhu: 70 లక్షల మంది రైతులకు వానాకాలం రైతుబంధు – నేటి నుండి రైతుల ఖాతాలలో జమ