Minimum Support Price: కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక బహుమతి అందజేసింది. 40 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచింది. ముడి జనపనారపై కనీస మద్దతు ధర పెంచేందుకు ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం పొందింది. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2023-24 సీజన్‌కు ముడి జనపనార రూ. 300 పెరిగింది. ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 5,050. ఈ పెరిగిన ఎంఎస్పీ వల్ల 40 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారని కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది.
ముడి జనపనారపై మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,050గా నిర్ణయించారు. ఈ నిర్ణయం భారతదేశ సగటు వ్యయంపై 63.2 శాతం రాబడిని నిర్ధారిస్తుంది అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. 2023- 24 సీజన్లో ముడి జూట్‌పై ఎమ్ఎస్పీ 2018-19 బడ్జెట్లో ప్రకటించిన సగటు ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువగా 1.5 రెట్లు మద్దతు ధరగా నిర్ణయించింది. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మద్దతు ధరను అందించే కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అగ్రి బిజినెస్ స్కీమ్ :
ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్యాక్ హౌస్‌లు మరింతగా పెరగనున్న రైతుల ఆదాయం. రైతులను గ్రామీణ ప్రాంతాలతో, వ్యాపారాలతో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రస్తుతం పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకంపై మోజు పెరుగుతోంది. కానీ కొన్ని రాష్ట్రాలు ఉద్యాన పంటల ఉత్పత్తి, వాణిజ్యాన్ని పెంచడానికి వ్యవసాయ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే హౌస్ ప్లాంట్లను అందిస్తున్నాయిపలు రాష్ట్ర ప్రభుత్వాలు. కొన్నిరాష్ట్రాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కూడా రైతులు ఆదాయాన్ని పొందేలా చేసున్నాయి.
పండ్లు, కూరగాయలు ఇతర ఉద్యాన పంటలు పండిరచే రైతుల ఉత్పత్తులకు భద్రత కల్పించడానికి ప్యాక్ హౌస్‌లను అందించడానికి హర్యానా ప్రభుత్వం ముందుకు వచ్చింది. హార్టికల్చర్ బిజినెస్ ను పెంచేందుకు రాష్ట్రంలో మొత్తం 50 ప్యాక్ హౌస్‌లను ప్రారంభించే యోచనలో ఉంది. ఇందుకోసం రైతుల నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నారు.
ప్యాక్ హౌస్ కోసం సబ్సిడీ..
హర్యానాలో ఉద్యాన పంటల ఉత్పత్తి, సంబంధిత వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం 50 ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ప్యాక్ హౌజ్‌లు రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఉద్యానవన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. ప్యాక్ హౌస్ ముఖ్య ఉద్దేశ్యం పండ్లు, కూరగాయలు వంటి పాడైపోయే ఉత్పత్తులను సంరక్షించడం.
Also Read: Soil Testing Significance: భూసార పరీక్ష- ఆవశ్యకత.!
ఇందుకోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి ?
హర్యానా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ప్యాక్ హౌస్ అందించడానికి: తీవ వెబ్సైట్లో మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం, రాష్ట్రప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1800-180-2021ని కూడా జారీ చేసింది. ఈ పథకం నిబంధనల ప్రకారం ఇప్పటికే ప్యాక్ హౌస్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు.
ప్యాక్ హౌస్ ద్వారా పెరుగనున్న రైతుల ఆదాయం….
ప్యాక్ హౌస్ సహాయంతో, రైతులు తమ ఉద్యానవన ఉత్పత్తులైన పండ్లు, కూరగాయల మందులను సులభంగా కడగడం, గ్రేడిరగ్ చేసి ప్యాకేజింగ్ చేయవచ్చు. దీనితో పాటు వారు స్థానిక మార్కెట్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలోనూ తమ ఉత్పత్తులకు ఆశించ దగిన ధరలను పొందవచ్చు.
ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక సహాయం అందుతుంది. ఈ ప్యాక్ హౌస్‌లు రైతులను హార్టికల్చర్ వ్యాపారం వైపు వెళ్లేందుకు దోహదపడతాయి. ఈ విధంగా ఆధునిక పద్ధతులతో రైతులను అనుసంధానించడం ద్వారా వినియోగదారులు సైతం నాణ్యమైన ఉత్పత్తులను పొందడానికి అవకాశం ఉంటుంది.
Also Read: Petunia Cultivation: పెటునియా పూల సాగు.!