Status of Indian Organic agriculture 2021-22: భారతదేశంలో వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్న కారణంగా అన్ని రకాల సేంద్రీయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ మరియు ఎగుమతి రంగంలో నిలకడ వృద్ధి నమోదు చేయడం, అధిక డిమాండ్ కారణంగా రైతులు లాభాల బాట పట్టడం ప్రోత్సాహ పరిచే విధంగా ఉంది. నేటి గణాంకాల ప్రకారం మొత్తం సేంద్రియ భూమి పరంగా భారతదేశం 8వ స్థానంలో, మొత్తం ఉత్పత్తిదారుల సంఖ్య పరంగా 1వ స్థానంలో ఉంది.
APEDA, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రతిస్టాత్మ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (NPOP)ని దేశం మొత్తం అమలు చేస్తుంది. ఉత్పత్తి మరియు గుర్తింపు కోసం భారత ప్రభుత్వం NPOP ప్రమాణాలను, యూరోపియన్ కమిషన్ మరియు స్విట్జర్లాండ్ దేశాల యొక్క సేంద్రియ ప్రమాణాలకు సమానమైన స్టాండర్డ్స్ ని ఏర్పరిచి ఎగుమతుల సామర్థ్యాన్ని విస్తరించాయి. ఈ గుర్తింపులతో, భారతదేశం నుండి గుర్తింపు పొందిన ధృవీకరణ సంస్థలు నిర్దిష్టంగా ధృవీకరించబడిన సేంద్రీయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి ఇతర దేశాలు ఆమోదించాయి. APEDA సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు పెంచడానికి దక్షిణ కొరియా, తైవాన్, కెనడా, జపాన్ మొదలైన దేశాలతో కూడా చర్చలలో ఉంది.
Also Read: Amul Recruitment 2022: అమూల్ మిల్క్ సంస్థలో ఉద్యోగాలు
2021 మార్చి 31 నాటికి సేంద్రీయ ధృవీకరణ ప్రక్రియలో 4339184.93 హెక్టార్లు సేంద్రీయ ఉత్పత్తి కోసం నమోదు చేయడం జరిగింది. ఇందులో 2657889.33 హెక్టార్ల విస్తీర్ణం పంటల కోసం, అడవి పదార్థాల సేకరణ కోసం మరో 1681295.61 హెక్టార్లు నమోదు చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక విస్తీర్ణం సేంద్రీయ ధృవీకరణలో ఉంది, తర్వాత స్థానంలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ మరియు కర్ణాటక రాష్ట్రాలు వరుస క్రమాలలో ఉన్నాయి. 2016లో, సిక్కిం రాష్ట్రం స్వతహా గా మొత్తం అనగా దాదాపు 75000 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉన్న సాగు భూమిని ఆర్గానిక్ సర్టిఫికేషన్ కు మార్చడం వల్ల ఇతర రాష్ట్రాల నుండి విశేషమైన గుర్తింపును సంపాదించడానికి తోడ్పడింది.
ఉత్పత్తి : భారతదేశం 2021-22 సంవత్సరంలో దాదాపు 3496800.34 MT సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది, వీటిలో నూనె గింజలు, నార, చెరకు, తృణధాన్యాలు & మినుములు, పత్తి, అపరాలు, సుగంధ & ఔషధ మొక్కలు, టీ, కాఫీ, పండ్లు, సుగంధ ద్రవ్యాలు వరుస స్థానాలలో ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ మొదలైనవి తరువాత వరుస క్రమంలో ఉంటాయి.సేంద్రియ ఉత్పత్తి కేవలం తినదగిన రంగానికే పరిమితం కాకుండా ఇతర రంగాలలో ఆర్గానిక్ పత్తి ఫైబర్, ఫంక్షనల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఉత్పత్తి చేయడం ఇతర రైతులకు ప్రోత్సాహకరం. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ మొదటి నాలుగు స్థానాలలో ఉండగా తర్వాత మధ్యప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారు. పదార్థాల పరంగా నూనె గింజలు, చక్కెర, తృణధాన్యాలు మరియు చిరు ధాన్యాలు, టీ & కాఫీ, నార పంటలు, పశుగ్రాసం, పప్పులు, ఔషధ/మూలికా, సుగంధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు & మసాలా దినుసులు వరసగా ఉత్పత్తి అవుతుండడం గమనార్హం.
ఎగుమతులు : 2020-21లో మొత్తం ఎగుమతులు 888179.68 మెట్రిక్ టన్నులు. సేంద్రీయ ఆహార ఎగుమతులు దాదాపు 707849.52 లక్షల రూపాయలు (1040.95 మిలియన్ USD) ఉంటుంది. సేంద్రియంగా ఉంటిపట్టి చేసిన పదార్థాలలో USA, యూరోపియన్ యూనియన్, కెనడా, గ్రేట్ బ్రిటన్, కొరియా రిపబ్లిక్, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, ఈక్వెడార్, వియత్నాం, ఆస్ట్రేలియా మొదలైన దేశాలు ముఖ్యులు. ఎగుమతి విలువను గునిస్తే సోయా మీల్ (57%)తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాలు, నూనె గింజలు (9%), తృణధాన్యాలు మరియు మినుములు (7%), టీ మరియు కాఫీ వంటి తోటల పంట ఉత్పత్తులు (6%), సుగంధ ద్రవ్యాలు మరియు మసాలాలు (5%), ఔషధ మొక్కలు (5%), డ్రై ఫ్రూట్స్ (3%), చక్కెర (3%) గా ఉన్నాయి.
Also Read: Chicken Price: బ్రాయిలర్ కోడి మాంసం ధరలు పెరగడానికి కారణాలివే