జాతీయం

Kitchen Essentials Price Hike: టమాట ధరతో పోటీ పడుతున్న అల్లం, చింతపండు ధరలు..

2
Kitchen Essentials Price Hike
Kitchen Essentials Price Hike

Kitchen Essentials Price Hike: ఈ సంవత్సరం మొదటిలో పెట్రోల్, వంటగ్యాస్ ధరలు ఎక్కువ మొత్తంలో పెరగడం అందరికి ఆందోళన కలిగించింది. ఈ వస్తువులే కాకుండా వంట నూనె ధరలు పెరడం కూడా వినియోగదారులకి ఎక్కువ భారంగా మారింది. అంతే కాకుండా గత రెండు, మూడు వారాలుగా టమాట ధరలు ఒక్కసారిగా పెరిగాయి. టమాట ఒకటే కాదు అని కూరగాయల ధరలు చాలా వరకు పెరిగాయి. ప్రస్తుతం అల్లం ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో కిలో అల్లం ధర 300 నుంచి 400 రూపాయల వరకు ఉంది. 60 కిలోల అల్లం బ్యాగ్ ధర గత సంవత్సరం 2000 నుంచి 3000 వరకు ఉంటే ఇప్పుడు ఒక బ్యాగ్ 11000 రూపాయల వరకు అమ్ముతున్నారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా అల్లంతో పాటు చింతపండు దిగుబడి తగ్గింది.

Also Read: Organic Farming: సేంద్రియ వ్యవసాయం నుంచి ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారు.?

Kitchen Essentials Price Hike

Kitchen Essentials Price Hike

ఒక ఎకరంలో 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన చింతపండు 1 నుంచి 2 క్వింటాళ్లకు పడిపోయింది. టమాట ధరలు పెరిగాయి. టమాటకి ప్రత్యామ్నాయంగా చింతపండును వాడుకుందాము అనుకున్న ప్రజలకి ఇప్పుడు వాటి ధర కూడా పెరగడం వల్ల ఆందోళన కలుగుతుంది. ప్రస్తుతం చింతపండు కిలో 120 నుంచి 200 రూపాయల వరకు అమ్ముతున్నారు.

చింతపండు సాగులో కర్ణాటక , తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో వ్యాపారులు కూడా చింతపండు నిల్వ చేయడానికి వాడే కోల్డ్ స్టోరేజీ ధరలు పేర్చడం కూడా ధరల పెరుగుదలకి కారణం.

Also Read: Avocado Crop: ఒక చెట్టు నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం తీసుకుంటున్న రైతులు..

Leave Your Comments

Organic Farming: సేంద్రియ వ్యవసాయం నుంచి ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారు.?

Previous article

India Caps Rice Exports: బియ్యం ఎగుమతులు నిషేధం.. విదేశాల్లో ఉన్న భారతీయులకి షాక్…

Next article

You may also like