Pradhan Mantri Kisan Maandhan Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా చాలా మందికి లబ్ది చేకూరుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం మరియు సౌకర్యార్థం కోసం కూడా కొన్ని పథకాల్ని అయితే అమలు లోనికి తీసుకువచ్చింది.
ఈ పథకాల ద్వారా రైతులకి ఎన్నో చక్కటి లాభాలు మరియు ప్రయోజనాలు చేకూరుతున్నాయి. వాటిల్లో చెప్పుకోదగిన పథకాలలో రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి.
ప్రతీ సంవత్సరం రూ.6,000 పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా కేవలం 4 శాతం వార్షిక వడ్డీకే వ్యవసాయ రుణాలు రైతులకి అందచేయడం జరుగుతుంది. అయితే ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతీ నెలా పెన్షన్ ని కూడా ఇస్తుంది. ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: Farmer Success Story: పంటలో పురుగుల భారం ఇలా తగ్గింది – రైతు
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన స్కీమ్: (Pradhan Mantri Kisan Maandhan Yojana)
ఈ పథకం కింద రైతులు ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ ని పొందొచ్చు.
ఈ పథకం అనేది 2019 వ సంవత్సరంలో ప్రారంభమైంది.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం… రైతులకి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పెన్షన్ స్కీమ్ ని కేంద్రం ప్రారంభించింది.
18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులోపు ఉన్న రైతులు ఈ పథకం లో చేరవచ్చు.
ప్రతీ నెల రూ.3,000 పెన్షన్ వస్తుంది. అంటే ఏడాదికి రూ.36,000 పెన్షన్ లభిస్తుంది. రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు.
ఎంత కట్టాలి..? ఎంత వస్తుంది..?
రైతుల యొక్క వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు వున్నప్పుడు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే… 18 ఏళ్ల వారు రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వారు రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వారు రూ.200 ప్రీమియం చెల్లించాలి.
ఇలా 60 ఏళ్ల దాకా కట్టాలి. 60 ఏళ్లు వయస్సు దాటగానే ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ ని ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మిగతా ప్రీమియంలు చెల్లించి పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.