జాతీయం

PM Kisan Tractor Scheme: సగం ధరకే ట్రాక్టర్ కొనుక్కోవచ్చు.. ఎవరు అర్హులు.?

3
PM Kisan Tractor Scheme
PM Tractor Yojana

PM Kisan Tractor Scheme: రైతే దేశానికి వెన్నెముక అని అంటారు. అటువంటి రైతన్న ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నాడు. రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. విత్తనాలు, పురుగుమందలకు పెరిగిన రేట్లకు మద్దతు ధరలు పెరగడం లేదు. కష్టంచి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, పండించిన పంటకు నిల్వ సదుపాయం లేక, మరోసారి పంట వేయటానికి చేతిలో చిల్లిగవ్వ లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. దీంతో ఖర్చులు బాగా పెరిగి పోవడంతో కర్షకుడుకి వ్యవసాయం అనేది భారంగా మారిపోతోంది. ఈనేపధ్యంలో రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రధాని అన్నదాతల కోసం ఓస్కీమ్ ను ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా సబ్సిడీ పై ట్రాక్టర్లను అందించేలా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ట్రాక్టర్‌ కొనలేని ప‌రిస్థితి

ట్రాక్టర్ ఉంటే రైతులకు చాలా మేలు ఉంటోది. కానీ ప్రస్తుతం ట్రాక్టర్ ల ధరలు లక్షల్లో ఉన్నాయి కాబట్టి రైతులు ట్రాక్టర్ లను కొనే పరిస్ధితుల్లో లేరు. దీంతో కేంద్రం ప్రభుత్వం రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందించే విధంగా స్కీమును అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ల కొనుగోలుపై 50శాలం సబ్సిడీతో కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది. ఈస్కీమ్ కింద ట్రాక్టర్‌ను కొనుగోలు చేస్తే రైతులకు సగం డబ్బు ఆదా అవుతుంది.

గతంతో పోలిస్తే వ్యవసాయ ఆధునీకరణ, టెక్నాలజీ కారణంగా సాగులో యంత్రాల వినియోగం పెరిగిపోయింది. రైతుల‌కు వ్యవ‌సాయంలో ఆస‌రాగా నిలిచే యంత్రాల్లో ముఖ్యమైనది ట్రాక్టర్‌. కానీ, దీని కొనుగోలు విషయంలో ఇప్పటికీ రైతులకు చాలా భారంగా ఉంది. రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి ల‌క్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్‌ కొనలేని ప‌రిస్థితి నెలకొంది. అలాంటి రైతులకు సగం ధరకే ట్రాక్టర్‌ను సొంతం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. అదే ‘ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజ‌న ప‌థ‌కం’. పీఎం ట్రాక్టర్ యోజ‌న ప‌థ‌కం అంటే ఏంటి? విధి విధానాలేంటి? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? ఏమేమి ప‌త్రాలు అవసరమవుతాయి? ఇలాంటి వివ‌రాల‌ను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Solar Dehydration Units in AP: రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటు..

PM Kisan Tractor Scheme

PM Kisan Tractor Scheme

రాష్ట్రాలు నోడ‌ల్ ఏజెన్సీలుగా

రైతుల‌కు త‌క్కువగా వ్యవ‌సాయ ప‌నిముట్లు అందించాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ఏకైక ప‌థ‌కం ఇది. ఈప‌థ‌కం కింద రైతుల‌కు 50 శాతం స‌బ్బిడీతో సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే వీలు క‌ల్పిస్తోంది.ఈప‌థ‌కానికి ఆయా రాష్ట్రాలు నోడ‌ల్ ఏజెన్సీలుగా ఉంటాయి. భార‌త‌దేశంలో ఉండే ప్రతి స‌న్నకారు, చిన్నకారు రైతు ఈ ప‌థ‌కానికి అర్హుడే. ఈప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందాల‌నుకున్న రైతు వ‌య‌స్సు 18 సంవ‌త్సరాల నుంచి 60 సంవ‌త్సరాల్లోపు ఉండాలి. సొంత పొలం ఉన్న రైతుల‌కు, కౌలు రైతుల‌కు ఇద్దరకి ఈప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఈప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే రైతుల కుటుంబ వార్షికాదాయం రూ.1.50 ల‌క్షల‌కు దాట‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న రైతు అర్హులైతే ఆ రైతుల‌కు స‌గం ధ‌ర‌కే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ గా ఇస్తుంది. మిగిలిన స‌గం మొత్తాన్ని రైతుకు రుణంగా బ్యాంకులు ఇస్తాయి

రైతులు ఈప‌థ‌కానికి అర్హులు

రైతులకు ట్రాక్టర్ కొనుగోలు చేయ‌డానికి ఏ బ్యాంకు అయితే రుణ‌మిస్తుందో ఆ బ్యాంకు వారికి ఈస‌బ్సిడీ మొత్తాన్ని కేంద్రం బ‌ద‌లాయిస్తుంది. గ‌త 7 సంవ‌త్సరాల్లో ట్రాక్టర్ కొనుగోలు చేయని రైతులు ఈప‌థ‌కానికి అర్హులు ఆవుతారు. ఈప‌థ‌కం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్ ను మాత్ర‌మే కొనుగోలు చేయ‌డానికి అనుమ‌తిస్తారు. ఈప‌త్రాలు పొందుప‌ర‌చాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఓట‌రు ఐడీ, పాన్ కార్డు లేదా పాసుపోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. త‌న పొలానికి సంబంధించిన అడంగ‌ల్ ప‌త్రాలు ఉండాలి. త‌న‌పేరిట ఉన్న బ్యాంకు ఖాతా వివ‌రాలు, వార్షికాదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇటీవ‌ల తీసిన పాసుపోర్టు సైజు ఫోటో ఉండాలి.

ఆన్‌లైన్‌లోనే మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీలు కల్పిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణలో కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ మీసేవా కేంద్రాల‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే రైతు తాను ఉన్న గ్రామ స‌చివాల‌యం, రైతు భ‌రోసా కేంద్రాల్లోని అధికారుల‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అయితే, దీనికోసం ముందుగా లాగ్‌ఇన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. రైతుల కోసం పీఎం కిసాన్ వెబ్‌సైటులో ప్రత్యేకించి హెల్ప్ లైన్ ఉంటుంది. ఈఫోన్ నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసి 155261 / 011-24300606 అనుమానాలు నివృత్తి చేసుకోవ‌చ్చు.

ఏపీ తెలంగాణలో రైతులు ఏం చేయాలి?

ఈప‌థ‌కాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మ‌రో అడుగు ముందుకేసి వినూత్నంగా అమ‌లు చేస్తున్నాయి.తెలంగాణ ప్రభుత్వం దీన్ని యంత్రలక్ష్మి పేరిట అమలు చేస్తూ ట్రాక్టర్‌తో పాటు వ్యవసాయ పరికరాలు కూడా అదనంగా ఇస్తోంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ యంత్రసేవ పేరిట అమలు చేస్తోంది. ఈ పథకానికి 155251 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు.తెలుగు రాష్ట్రాల్లో రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. లేదా మీకు ద‌గ్గర్లోని వ్యవ‌సాయ‌శాఖాధికారిని సంప్రదించ‌వ‌చ్చు.

Also Read: Rice Farmers Struggles: వరిని కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు.!

Leave Your Comments

Solar Dehydration Units in AP: రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటు..

Previous article

GramHeet Startup: రైతులకు వరంగా మారిన గ్రామ్ హిత్ స్టార్టప్.!

Next article

You may also like