Hike in Onion Prices: రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యుడిపై భారం పడుతోంది. దీనితో పాటు కూరగాయలధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే టమాటా ధరలు మండిపోతుంటే అదేదారిలో ఉల్లి ధరలు కూడా కన్నీళ్లు తెప్పించేందుకు సిద్దంగా ఉన్నాయి. టమాటా లానే ఉల్లి ధరలు పెరుగుతాయన్ని మార్కెటు వర్గాల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
రానున్న రోజుల్లో ఉల్లి ధర రికార్టు స్థాయిలో పెరిగే ఆవకాశాలున్నాయి. ఉల్లి ధరలు సెప్టెంబర్ కల్లా కిలో రూ.60-70 వరకు చేరొచ్చని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది. అయితే సరఫరా తగ్గడం వల్ల ఈ పెరుగుదల ఉండవచ్చని నివేదిక పేర్కొంటోంది.
వినియోగదారులకు షాక్ కొడుతున్న ఉల్లి
పోయిన సంవత్సరం ఉల్లి ధరలు బాగా తగ్గడంతో రైతులు ఈసారి ఉల్లిని తక్కువగా సాగు చేశారు. అదే సమయంలో వాతావరణ పరిస్థితులు ఉల్లిపై పడడం ప్రారంభించింది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లి క్రమంగా తగ్గుతుంది. నిల్వ చేసిన ఉల్లిని వచ్చే నెల నుంచి బయటకు తీస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధర పెరగడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా టమోటా తర్వాత ఇప్పుడు ఉల్లి వినియోగదారులకు షాక్ కొడుతోంది.
Also Read: తిలాపియా చేపల అమ్మకం తో ఉపాధి.!
ఉల్లి సరఫరా బాగానే ఉన్నా ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి సాగు ఎక్కువగా చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ ఎత్తున నష్టపోయారు. ఇప్పటికే టమాట ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు ఇప్పుడు ఖర్చుల విషయంలో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
వర్షపాతం పై కూడా ఉల్లి ధరలు
ఆగస్టు చివరి వారానికి నాటికి ఉల్లి ధరలు 150 శాతం పెరుగుతాయని చెబుతున్నారు మార్కెట్ వర్గాలు. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 40 వరకు ఉంది. దీనిని బట్టి చూస్తే ఉల్లిధరలు పెరిగే ఆవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ నాటికి సరఫరాలు తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ పేర్కొంది. అయితే అక్టోబర్ నుంచి ఖరీఫ్ పంట వస్తుంది కాబట్టి, దిగుబడులు పెరిగితే ఉల్లి ధరలు మళ్లీ తగ్గుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆగస్ట్, సెప్టెంబర్ వర్షపాతంపై కూడా ఉల్లి ధరలు ఆధారపడి ఉంటాయని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఉల్లి ధరలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Also Read: కంజు పిట్టల పెంపకంలో ఆదాయం.!