జాతీయం

Oil Prices: నూనె ధరలు భారీగా తగ్గుతున్నాయి.!

2
Major Edible Oil Brands
Oil Prices Falling

Oil Prices: కూరగాయలు, నిత్యావసర ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. దాని వల్ల దేశీయ మార్కెట్‌లో కూడా వంట నూనె ధర తగ్గుతున్నాయి. వంట నూనె ధర తగ్గడం వల్ల దీనికి డిమాండ్ పెరిగింది. సామాన్యులు వంట అవసరాలను తీర్చడానికి వంట నూనెలను తక్కువ ధరలో కొనుగోలు చేస్తున్నారు.

మన దేశంలో వంట నూనెల దిగుమతి పెరుగుతుంది. దేశంలో ఉన్న జనాభాకి కనీసం 30 శాతం నూనె కూడా ఉత్పత్తి చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఆయిల్ ప్లామ్ పెంచడానికి రైతులకి ట్రయినింగ్, సబ్సిడీ ఇచ్చిన కూడా ఆయిల్ ప్లామ్ ఉత్పత్తి జరగడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.

Also Read: Red Gram: వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంట కంది.!

Prices Of Edible Oil

Oil Prices

గత సంవత్సరం జూన్ నెలతో పోలిస్తే ఈ సంవత్సరం దిగుమతి 39.31 శాతం పెరిగింది. వంట నూనెలకు పెరుగుతున్న డిమాండ్ వల్ల దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. కూరగాయల నూనెల దిగుమతి ఈ సంవత్సరం 49 శాతం పెరిగింది. ఈ దిగుమతులో 2900 టన్నుల నాన్-ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి. నాన్-ఎడిబుల్ ఆయిల్స్ సబ్బులు , రసాయన ఉత్పత్తిలో వాడుతారు.

సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేసన్ ఆఫ్ ఇండియా ప్రకారం అంతర్జాతీయ, దేశీ మార్కెట్‌లో వంట నూనె ధరలు భారీగా తగ్గడంతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. దిగుమతి పెరగడం వల్ల దేశంలో వంట నూనెల స్టాక్ ఎక్కువగా ఉంది, దీని వల్ల రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. జూన్ నెలలో క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులు 4.66 లక్షల టన్నులుగా ఉన్నాయి. మే నెలలో ఈ దిగుమతులు 3.48 లక్షల టన్నులు. దీని కారణంగా మార్కెట్లో నూనె ధరలు రానున్న రోజులో ఇంకా తగ్గే అవకాశం ఉంది. కానీ మన దేశంలో దిగుమతి శాతం తగ్గించి, ఉత్పత్తి పెరిగితే ప్రజలకి, ప్రభుత్వానికి లాభాలు ఉంటాయి.

Also Read: Really Agricultural Manual Seeder: రియల్లీ కంపెనీ నుండి అందుబాటులోకి వచ్చిన మాన్యువల్ సీడర్

Leave Your Comments

Red Gram: వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంట కంది.!

Previous article

Oil Palm Cultivation: మీకు తెలుసా? ఒక్కసారి నాటితే 40 సంవత్సరాలు దిగుబడి వచ్చే పంట

Next article

You may also like