National Bamboo Mission: దేశంలో లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంద రంగాలపైన ఆధారపడుతున్నారు. వాతావరణ పరిస్ధితులను బేరీజు వేసుకొని పంటలను సాగుచేస్తున్నారు. అంతేకాకుండా ఒక పంట పైన ఆధారపడకుండా అందులో అంతరపంటలను సాగుచేస్తున్నారు. ఎందుకంటే ఒక పంట నష్టపోయిన మరోపంటతో లాభాలను పొందువచ్చని. ఎక్కువ మంది ఇప్పుడు వ్యవసాయంపైన మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే దీనిలో ఆధిక లాభాలు వస్తున్నాయి. యువకులు కూడా దీనిపైన దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, గోధుమ వంటి ఆహార పంటలు సాగు చేస్తుంటారు. మెట్ట ప్రాంతాల్లో అయితే వాణిజ్య పంటలను వేస్తుంటారు. అయితే ఎక్కువగా రైతులు సంప్రదాయ పంటల వైపే మొగ్గుతుంటారు. వాటిలో లాభాలను పొందకుండా నష్టాలను చవిచూస్తున్నారు.
పెట్టుబడిలో 50 శాతం సబ్సిడీ
ప్రస్తుతం మన దేశంలో ప్రజల చూపంతా వ్యవసాయం వైపు మళ్లిందనే చెప్పాలి. ఎందుకంటే ఆదాయం పెరగడమే దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా ఆహార పంటలతో పాటు లాభసాటిగా ఉండే వాణిజ్య పంటలను సాగు చేస్తూ వ్యవసాయం వైపు యువత మళ్లుతుంది. ప్రస్తుతం వెదురుకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి అవసరాలకు తగిన స్థాయిలో వెదురు ఉత్పత్తి కాకపోడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈకారణంగానే ప్రభుత్వం ఇప్పుడు దేశంలో వెదురు ఉత్పత్తిని పెంచడానికి రైతులను ప్రోత్సహిస్తోంది. వెదురు పండించే రైతులకు సబ్సిడీ ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈపథకాన్ని అమలు చేస్తున్నాయి. వ్యవసాయం చేస్తూ మంచి రాబడి కోరుకునే వారికి వెదురు సాగు సరైన ఎంపికగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వమే నేరుగా పెట్టుబడిలో 50 శాతం సబ్సిడీ ఇస్తుండడం మంచి అవకాశమని సూచిస్తున్నారు.
Also Read: Inter Cropping: మామిడిలో అంతరపంటగా అల్లం..
50 ఏళ్ల పాటు ఉత్పత్తి
వెదురుచెట్లను బంజరు భూముల్లో కూడా పండించవచ్చు. దీనికి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుది. ఒకసారి నాటిన వెదురు మొక్క నుంచి 50 ఏళ్ల పాటు ఉత్పత్తి ఉంటుంది. వెదురు పెంపకానికి కూలీలు అవసరం కూడా ఉండదు. అందుకే వెదురు వ్యవసాయం రైతులలో బాగా ప్రాచుర్యం పొందింది. వెదురు పంటను ఎక్కడైనా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో వెదురును అత్యధికంగా పండిస్తున్నారు. ఒక హెక్టారు భూమిలో 1500 వెదురు మొక్కలు నాటుకోవచ్చు. వెదురు మంచి ఉత్పత్తి కోసం మెరుగైన రకాలను రైతులు ఎంచుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున పంట విక్రయించుకోవడం సులభమవుతుంది. అలాగే మంచి ధర వస్తుంది.
ప్రతి జిల్లాలో నోడల్ అధికారి
జాతీయ వెదురు మిషన్ ద్వారా రైతులకు వెదురు పెంపకంపై అధికంగా ఖర్చు చేస్తున్నారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. వెదురు సాగుకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సహాయం పొందడానికి రైతులు నేషనల్ బాంబూ మిషన్ అధికారిక వెబ్సైట్ NBM.nic.in లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జాతీయ వెదురు మిషన్ కింద ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించారు. వెదురు 4 ఏళ్ల తర్వాత చేతికి వస్తుంది. ఏకంగా ఎకరానికి రూ. 4 లక్షల వరకు సంపాదించవచ్చు. అంటే హెక్టారుకు రూ.12 లక్షల వరకు వస్తుంది. దీంతో పాటు ఇతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. దీంతో సాగుకు చేసిన ఖర్చును ముందు రాబట్టుకోవచ్చు.
Also Read: Plant Genome Saviour Community Award 2023: వరి సేద్యంలో కృష్ణాజిల్లా యువ రైతుకు జాతీయ అవార్డు.!