Plant Genome Saviour Community Award 2023: అందరు అమెరికా అంటేనే ఎగిరి గంతేస్తారు. అందులో సాఫ్ట్ వేర్ ఉద్యోగమంటే అందరికీ ఇష్టమే. కానీ అతను మాత్రం కన్న ఊరు రుణం తీర్చుకోవాలని భావించాడు. ఉన్న ఊళ్లోనే వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. ఉద్యోగం వదులుకొని సొంత ఊరికి వచ్చి వ్యవసాయంపై దృష్టి సారించాడు. అయితే పాడి, పంట మధ్య పెరిగిన జీవితం వారిది. అందుకే వ్యవసాయంలోకి అడుగు పెట్టారు. మెళకువలు తెలుసుకుని తక్కువ పెట్టుబడి తో సిరులు కురిపిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పది మందికి దారి చూపుతూ తనలోని మక్కువను చూపుతున్నారు. ఈ నేపద్యంలో సాగులో కొత్త విధానాలను రూపొందించాలని అనుకున్నాడు. అందుకే పురాతన ధాన్యంపై దృష్టి పెట్టారు.
257 రకాల పురాతన వరి వంగడాలు
ఈ వరి సేద్యంలో కృష్ణాజిల్లా యువరైతు కు జాతీయ అవార్డు వరించింది. ఎందుకంటే పురాతన ధాన్యంను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని దృఢ సంకల్పంతో రఘు వీర్ ఉద్యోగం వదిలి వ్యవసాయంపై మక్కువతో వచ్చాడు. ఈ క్రమంలోనే 257 రకాల పురాతన వరి వంగడాలను సేకరించి వాటిని తన పొలంలో సాగు చేశారు. ఈ కృషిని గుర్తించిన కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని అథారిటీ జాతీయ మొక్కల జన్యు రక్షకుని అవార్డును న్యూఢిల్లీలో శనివారం యువ అభ్యుదయ రైతు నందం రఘు వీర్‌కు జాతీయ స్థాయి అవార్డు వరించింది.
Also Read: Inter Cropping: మామిడిలో అంతరపంటగా అల్లం..
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ సంస్థ రెండేళ్లకు ఒకసారి ఈ రంగంలో విశేష సేవలు అందిస్తున్న రైతులు, సంస్థలు వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది. దీనిలో భాగంగా 2023-25 సంవత్సరానికి గాను అత్యంత అరుదైన విత్తనాలను సంరక్షిస్తున్న కేటగిరీలో రఘు వీర్‌ను జాతీయ మొక్కల జన్యు రక్షకుని అవార్డుకు ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రఘు వీర్ అవార్డు, ప్రశంసా పత్రం తో పాటు రూ 1.50 లక్షల నగదు బహుమతిని కూడా అందుకున్నారు.
10కి పైగా జీఐ ట్యాగ్ కలిగిన వంగడాలు
దేశవ్యాప్తంగా తిరిగి 257 రకాల అత్యంత పురాతన వరి వంగడాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్ కలిగిన వంగడాలు కూడా ఉండడం విశేషం. తాను సేకరించిన పురాతన విత్తనాలను పెనమలూరులోని తన సొంత పొలం 1.3 ఎకరాల్లో రఘు వీర్ సంరక్షిస్తున్నారు. ముందు తరాల కోసం భద్రపరిచేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీయ విత్తన నిధిను కూడా ఏర్పాటు చేశారు. మరో 8 జిల్లాల్లో విత్తన నిధిల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు రఘు వీర్. పురాతన వరి విత్తనాలను భావి తరాలకు అందించడమే కాదు.. వాటి సాగులో మెళకువలపై కూడా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నారు.
Also Read: Jaivik India Award 2023: ఏపీలో సేంద్రియ వ్యవసాయానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా అవార్డు.!