జాతీయంమత్స్య పరిశ్రమ

Fisheries Incubation Centre: ఫిషరీస్ ఇంక్యుబేషన్ సెంటర్‌ కు ₹10 కోట్ల గ్రాంట్‌ చేసిన KUFOS

1
Fisheries Incubation Centre
Fisheries Incubation Centre

Fisheries Incubation Centre: ఫిషరీస్ మరియు అనుబంధ రంగాలలో పరిశోధన, సాంకేతిక పురోగతి మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి కేంద్రం కుఫోస్ ఫిషరీస్ ఇంక్యుబేషన్ సెంటర్‌ ను ప్రవేశపెట్టింది. ఫిషరీస్ రంగంలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతకు గణనీయమైన ప్రోత్సాహంతో కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ (కుఫోస్) NITI ఆయోగ్ నుండి ₹10 కోట్ల గ్రాంట్‌ను పొందింది. విశ్వవిద్యాలయంలో ఫిషరీస్ రంగంలో భారతదేశపు మొట్టమొదటి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (AIC)ని స్థాపించడం, ఆవిష్కరణ మరియు సాంకేతిక అభివృద్ధి సంస్కృతిని పెంపొందించడం ఈ గ్రాంట్ లక్ష్యం.

యువకులను ప్రోత్సాహం: KUFOS ప్రొఫెసర్ మరియు ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగాధిపతి రాధిక రాజశ్రీ సీయ పర్యవేక్షణలో ఈప్రాజెక్ట్‌ జరగనుంది. కుఫోస్‌ వైస్‌-ఛాన్సలర్‌ టి ప్రదీప్‌కుమార్‌ ఈసందర్బంగా మాట్లాడుతూ మత్స్య మరియు సముద్ర అధ్యయన రంగంలో తాము చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని అన్నారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆవిష్కరణలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని సముద్ర పర్యావరణ వ్యవస్థలు మరియు మత్స్యకార సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు అత్యాధునిక సాంకేతికతలు మరియు పరిష్కారాలు అభివృద్ధి చేయడానికి యువకులను ప్రోత్సహిస్తుందన్నారు.

Also Read: Mushroom Farming: పెరట్లో రైతు పండించిన 10 కిలోల పుట్టగొడుగులు.!

Fisheries Incubation Centre

Fisheries Incubation Centre

ఉద్యోగ కల్పనలో కీలకపాత్ర: ఈప్రాంతంలో స్టార్టప్‌లు మరియు వినూత్న ప్రాజెక్టులకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించడం ద్వారా, మత్స్య పరిశ్రమలో పురోగతిని సాధించడం దీని ప్రధాన లక్ష్యం. విద్యాసంస్థలు, పరిశ్రమలు మరియు ప్రభుత్వం మధ్య సహకారాన్ని ప్రోత్సహించేదుకు AIc పనిచేస్తుంది. అలాగే పరిశోధన ఫలితాల వాణిజ్యీకరణకు తోడ్పాటును ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ఇది ఉద్యోగ కల్పనలో కీలక పాత్ర పోషించనుంది. స్టార్టప్‌లు మరియు వ్యవస్థాపకులకు అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందించి నీతి ఆయోగ్ గ్రాంట్ మద్దతుతో, మత్స్య రంగంలో సానుకూల మార్పు మరియు స్థిరమైన అభివృద్ధిని నడిపించడంలో కుఫోస్ సిద్దంగా ఉంది.

Also Read: Tomato Crop Protection: నైలాన్‌ తెరలు నుంచి టమాటా పంటను కాపాడుకుంటున్న రైతులు..

Leave Your Comments

Mushroom Farming: పెరట్లో రైతు పండించిన 10 కిలోల పుట్టగొడుగు.!

Previous article

Chilli Exports: మిర్చి అ’దర’హో ఈఏడాది ఎగుమతులు పదివేల కోట్లు.!

Next article

You may also like