Indian Tea Prices: కాఫీ అనగానే దక్షిణ భారతదేశమే గుర్తుకొస్తుంది. ప్రధానంగా కాఫీ ఉత్పత్తిలోనూ, విస్తీర్ణంలోనూ కర్ణాటక రాష్ట్రానిదే హవా, ఆంధ్రప్రదేశ్ లో కాఫీ సాగుకు విశాఖపట్టణం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతాలకు పరిమితమైంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా కాఫీ సాగు చేస్తున్న గిరిజనులకు సరైన అవగాహన, తగిన ప్రోత్సాహం లేకపోవడంతో దీని ఉనికి నామమాత్రంగానే ఉంది.
సాధారణంగా కాఫీ తోటల పెరుగుదలకు ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. సముద్రం కంటే 1000 నుంచి 2000 అడుగులు ఎత్తైన కొండవాలు ప్రదేశాలు దీనికి అనుకూలంగా ఉంటాయి. 25 నుంచి 30 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో కాఫీ పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. కాఫీ చెట్లకు నీడ వాతావరణం తప్పనిసరిగా ఉండాలి. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని పశ్చిమ కనుమ పర్వత ప్రాంతాలు అనుకూలమైనవి కావడంతో సహజంగానే అక్కడ కాఫీ తోటలు విస్తరించాయి. విశాఖ ఏజన్సీలో కాఫీకి వాణిజ్య విలువ పెరగడంతో రైతులు సాగు పట్ల అధిక ఆసక్తి చూపుతున్నారు.
Also Read: Bullet Tractor: బుల్లెట్ ట్రాక్టర్ తో సేద్య ఖర్చులు ఆదా.!
టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
విశాఖజిల్లా చింతపల్లి ప్రాంతంలో కాఫీ తోటలను సాగు చేస్తూ ఉంటారు. నాటిన ఐదవ సంవత్సరం నుంచి రైతులకు దిగుబడి లభిస్తుంది. అధిక దిగుబడిని పొందాలంటే సరైన సమయంలో యాజమాన్య పద్దతులు చేపడితే ఆధిక దిగుబడులను సాధించవచ్చు. అయితే ఈ పంటలకు 2020 నుంచి ధరలు లేవని అందుకే సాగు తగ్గిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో తేయాకు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల భారతదేశ మొత్తం గణనీయ సంక్షోభం వైపుకు దారి తీస్తుందని టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ధర క్రమంగా తగ్గడం
2020లో లభించిన ధరతో పోల్చితే ఇప్పుడు పొందే ధర క్రమంగా తగ్గుతోంది. నవంబర్ 2020తో పోలిస్తే నవంబర్ 2021లో ధరలు తగ్గాయి. పశ్చిమ బెంగాల్లో వేతనాల పెరుగుదల 201 శాతం మరియు అస్సాంలో పెరుగుదల 186 శాతంగా ఉంది. ఎరువులు మరియు బొగ్గుపై ఇన్పుట్ ఖర్చులు 9-15 శాతం పెరిగాయని అయితే తేయాకు ధరల పెరుగుదల కేవలం 3 శాతం మాత్రమే పెరిగిందని అసోసియేషన్ తెలిపింది. దీంతో తేయాకు ఉత్పతి గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. పంట తగ్గడానికి వాతావరణ పరిస్థితులు అని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
Also Read: Israel Olive Tree: ఆ రైతును కోటీశ్వరుడుని చేసిన ఇజ్రాయెల్ చెట్టు.!