జాతీయంమన వ్యవసాయం

Chipko Movement: చిప్కో ఉద్యమం గురించి ఎంతమందికి గుర్తుంది.!

0
Chipko Movement
Chipko Movement

Chipko Movement: చిప్కో ఉద్యమం గురించి ఎంతమందికి గుర్తుంది.!: సుమారు 300 సంవత్సరాల క్రితం, రాజస్థాన్‌ని పాలించె ఒక రాజు అక్కడ ఉన్న ‘ఖేజ్రీ’ చెట్లను నరికి వాటి నుండి సున్నం తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. బిష్ణోయ్ మహిళ అయిన అమృతా దేవి ఇతర స్థానిక మహిళలతో కలిసి వాళ్ళు ఆధారపడే అరుదైన వనరులు చెట్లను నరికివేయకుండ వాళ్ళను అడ్డుకోవాలని చెట్లను హద్దుకున్నారు కానీ, వాళ్ళు మహిళలను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. తర్వాత ఆ పాలకుడు తన తప్పును గ్రహించాడు.

Chipko Movement

Chipko Movement

Also Read: Care Taken to Avoid Food Poisoning: ఇలా చేస్తే ఫుడ్ పాయిసనింగ్ జరగదు.!

ఈ కథని 1970 లో మళ్ళీ హిమాలయాల ప్రాంతంలో టింబర్ కోసం చెట్లను నరుకుతున్నపుడు గుర్తుంచుకొని అక్కడ ఉన్న మహిళలు, ఇంకా సుందర్‌ లాల్ బహుగుణ మరియు చండీ ప్రసాద్ భట్ వంటి వారి సహాయంతో కాంట్రాక్టర్లచే అడవి నిర్మూలనను అడ్డుకోవడానికి ఒక ప్రజల ఉద్యమాన్ని చేశారు. మహిళలు చెట్లను గట్టిగా హత్తుకుని వారి జీవితాలను త్యాగం చేసిన సంఘటనకు జ్ఞాపకార్థంగా ఈ ఉద్యమానికి ‘చిప్కో’ ఉద్యమం అని పిలిచారు. ఈ ఉద్యమం మూడు శతాబ్దాల క్రితం రాజస్థాన్‌లో 300 బిష్ణోయ్ మహిళలు జరిపిన మార్గాన్ని అనుసరించింది.

నేడు చిప్కో ఉద్యమం అనేది ప్రధానంగా ఉత్తరాఖండ్ మరియు గర్హ్వాల్ కొండలలో నివసించే స్థానిక మహిళలు ప్రారంభించారు. ఎందుకనగా (సాంప్రదాయ ఇంధనం సేకరించేవారు) అటవి నిర్మూలన వలన అధికంగా నష్టపోయేది ఈ‌ విభాగం మాత్రమే! ఇలా నరకడం వలన కేవలం ఇంధనం మరయు పశుగ్రాసం వనరులు వారి నివాస ప్రాంతాల చుట్టూ తగ్గిపోవడమే కాకుండా ఇది విలువైన మట్టిని మరియు తీవ్రమైన వరదలకు దారితీసింది. చిప్కో కార్యకర్తలు ఈ అడవుల నరికివేతకు వ్యతిరేకంగా హిమాలయాల ప్రాంతంలో ఎన్నో పాదయాత్రలు చేసారు. ఈ ఉద్యమం చాలా విజయవంతంగా సాగింది మరియు స్థానిక మహిళా సంఘాల మద్దతు కూడా పొందింది. ఈ ఉద్యమం ద్వారా అడవులు అక్కడ స్థానిక ప్రజలకు జీవనాధారమని ప్రపంచం మొత్తానికి నిరూపించింది. అడవుల వలన కలిగే ఉపయేగాలను లెక్కకట్టలేము కాని అవి నేల పరిరక్షణలో ఇంకా భూమిలో ఉండె సహజ నీటి పాలన నిర్వహణ వంటి పర్యావరణ సేవలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

స్వాతంత్య్రానికి ముందు గాంధీజీ శిష్యురాలు అయిన మీరాబెన్ మరియు కొంతమంది మహిళలు గంగా ప్రాంతంలో వచ్చిన వరదలకు ఇంకా వీరి గ్రామాల వినాశనానికి దారి తీసింది. అటవీ నిర్మూలన అని అక్కడికి వెళ్ళి అర్థం చేసుకున్నారు. హిమాలయాలలోని ఓక్ మరియు ఇతర విశాలమైన ఆక్కులు కలిగిన చెట్లకు బదులుగా టింబర్ మరియు రెసిన్ అవసరాల కోసం పర్యావరణ మరియు సామాజిక విపత్తులను తగ్గించడం కోసం వేగంగా పెరిగే పైన్ ను వాళ్ళు పెంచడం మొదలు పెట్టారు.

Also Read: High Density Planting in Cotton: అధిక సాంద్ర పద్దతిలో “తెల్ల బంగారం”సాగు

Leave Your Comments

Care Taken to Avoid Food Poisoning: ఇలా చేస్తే ఫుడ్ పాయిసనింగ్ జరగదు.!

Previous article

Training in trees : కొమ్మల కత్తిరింపు వల్ల చెట్టులో కలిగే మార్పులు

Next article

You may also like