PM Kisan 13th Installment Date 2023: దేశంలోని రైతుల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.. రైతులకు ప్రభుత్వం అనేక రకాలైన ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చును.
ఇప్పటివరకు 12 విడత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan Samman Nidhi) యోజన నిధులు రైతుల ఖాతాలకు చేరాయి. ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 సహాయం అందజేయడం జరుగుతుంది. ఈ 6000 రూపాయల మొత్తంను కేంద్ర ప్రభుత్వం మూడు వాయిదాల్లో రైతులకి అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం. 13వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రకరకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇప్పుడు దానికి సంబందించిన మరో అప్డేట్ రానే వచ్చింది..
Also Read: Minister Niranjan Reddy: దేశానికి నూతన వ్యవసాయ విధానం అత్యవసరం – మంత్రి నిరంజన్ రెడ్డి

PM Kisan 13th Installment Date 2023
కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత రైతుల ఖాతాలోకి హోలీలోపు వస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే 13వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించింది మోడీ సర్కార్. అంటే ఈ పథకం ఫిబ్రవరి 24, 2023 నాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అదే రోజున ప్రభుత్వం తమ ఖాతాలలోకి నిధులను బదిలీ చేయవచ్చని రైతులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి తేదీని ప్రకటించకపోయినా అదే రోజు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని ఒక సమాచారం అయితే ఉంది..
కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క ప్రయోజనాన్ని పొందాలంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఇ-కేవైసీ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు తెలిపింది. కేవైసీ లేని రైతులకు ఈ విడత డబ్బులు నిలిచిపోనున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. e-KYC ప్రక్రియను పూర్తి చెయ్యడానికి రైతులు ముందుగా PM కిసాన్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. అక్కడ ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో e-KYCపైన క్లిక్ చేయాలి. వెంటనే కొత్త పేజీ తెరిచినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. ఆధార్ నుండి నమోదైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసిన తర్వాత e-KYC చేయడం పూర్తవుతుంది…ఇలా చేస్తేనే ప్రధానమంత్రి అందించే కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అకౌంట్లోకి జమ చేయబడతాయి.
Also Read: Crop Protection: అకాల వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు.!