Oil Price: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త అందజేసింది. వంట నూనె ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నూనె ధరల విషయంలో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే, అయితే త్వరలోనే వంట నూనె ధరలు మరింత తగ్గించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల సామాన్యులకు కొంతమేరకు ఇబ్బందులు తగ్గుతాయని చెప్పుకోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ మార్కెట్‌లోని నూనె ధరల తగ్గింపునకు అనుగుణంగా దేశి మార్కెట్లో కూడా అవే ధరలను అమలుపరచాలని కేంద్రం ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వంట నూనె విక్రయించే ఆయిల్ కంపెనీలు కూడా ధరలను తగ్గించడానికి ముందుకు వచ్చాయి. ఆ కంపెనీలు నూనె ధరలను ఏకంగా 6 శాతం వరకు తగ్గించడానికి సిద్ధం అయ్యాయి.
Also Read: PM Kisan FPO Yojana: రైతుల కోసం 15 లక్షల రూపాయలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.!
అంతర్జాతీయ మార్కెట్‌లో కమొడిటీ రేట్లకు అనుగుణంగా దేశంలో వంట నూనె యొక్క గరిష్ట విక్రయ ధర (MRP) కూడా తగ్గించాలని కేంద్రం కోరడంతో, దానికి ఆయిల్ కంపెనీలు కూడా అంగీకారం తెలిపాయి. ఫార్చూన్ బ్రాండ్ పేరు మీద వంట నూనె విక్రయించే అదానీ విల్‌మర్, జెమిని బ్రాండ్ పేరు మీద నూనె విక్రయిస్తున్న జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా వంటి కంపెనీలు వంట నూనె ధరలను వరుసగా లీటరుకు రూ. 5, రూ. 10 చొప్పున తగ్గించడానికి సిద్ధం అయ్యాయి.
ఈ నూనె యొక్క తగ్గింపు ధరలు సామాన్య ప్రజలకు వచ్చే మూడు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. వేరు శనగ, సోయాబీన్, ఆవాల ఉత్పత్తి కూడా పెరగడంతో గత ఆరు నెలల నుండి అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గత 60 రోజుల నుండి వంట నూనె ధరలు ఇంకా తగ్గాయని చెప్పవచ్చు. ఈ విషయంపై సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) మంగళవారం నాడు కీలక ప్రకటన కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వం రేట్ల తగ్గింపు ప్రయోజనం సామాన్యులకు వీలైనంత తొందరగా అందేలా చూడాలని కోరిందని ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Medicinal Plant Nela Usiri Benefits: నేల ఉసిరిలో దాగున్న నమ్మలేని ఔషధ గుణాలు!