FSSAI Salary in India 2023: ఉద్యోగాల వేటలో ఉన్న వారి కోసం మంచి శుభవార్త. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సువర్ణావకాశం ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాళీ పోస్టులను భర్తీ పూర్తి చేయడానికి అర్హులైన లేదా ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చైర్‌పర్సన్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదలు జరిగింది. నోటిఫికేషన్ ధరఖాస్తుకి జూలై 10 , 2023 ప్రారంభమై , ఆగస్టు 23 , 2023 తేదీన పూర్తి అవుతుంది.
Also Read: Plant Growth Regulators: మొక్కల పెరుగుదల కోసం హార్మోన్ల ద్రావణం తయారీ ఎలా చేసుకోవాలి.?
చైర్‌పర్సన్ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి మీ వయస్సు 1-9-2023 వరకు 50-65 సంవత్సరాలు ఉండాలి. ఈ పోస్ట్కి రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులై ఉండాలి. చైర్‌పర్సన్ పోస్ట్కి నియమితులైన వారికి 2,25,000 రూపాయల జీతం వస్తుంది. దానితో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఇస్తారు. చైర్‌పర్సన్ పోస్ట్కి నియమించిన వ్యక్తికి న్యూఢిల్లీలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పదవి ఇస్తారు.
చైర్‌పర్సన్ పోస్ట్ అర్హులకి ఆహార పరిశ్రమలో 20 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆహార భద్రత , నాణ్యత పై అవగాహన ఉండాలి. ఎఫ్‌ఎస్‌సై రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎఫ్‌ఎస్‌సై అధికారిక వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఎస్‌సై రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక చేసుకోవాలి. ఇందులో రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలు ఇస్తారు. చైర్‌పర్సన్ పోస్ట్కి దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం, దరఖాస్తు చేసుకోవడానికి FSSAI వెబ్ సైట్కి వెళ్ళండి.