Bamboo Crafts: ప్రస్తుత కాలంలో ఇంటిలో ఉన్న అలంకరణ వస్తువుల నుంచి చిన్న పిల్లలు ఆడుకునే వస్తువుల వరకు అని ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తున్నారు. దాని వల్ల హస్తకళలు తగ్గిపోతున్నాయి. అందువల్ల ప్రభుత్వం కొత్త పథకాలతో హస్తకళలు పెంచాలి అని చూస్తుంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకి ఆర్థికంగా సహాయం చేయాలి అని హస్తకళల మిషన్ ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు ఇంట్లో కూర్చొనే మంచి లాభాలు సంపాదిస్తున్నారు. ఈ పథకం మొదటిలో పెరటిలో ఉండే వెదురు మొక్కలతో హస్తకళలతో ఆదాయం పొందేవారు.
వెదురుతో హస్తకళలు చేయడం ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర ప్రాంతాలలో బాగా ప్రసిద్ధి చెందింది. పెద్ద పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామాలు, ఇళ్లలో కూడా వెదురు బొంగుతో హస్తకళలు తయారు చేస్తున్నారు. వీటికి సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రెటీల వరకు మంచి డిమాండ్ ఉంది.
Also Read: India Caps Rice Exports: బియ్యం ఎగుమతులు నిషేధం.. విదేశాల్లో ఉన్న భారతీయులకి షాక్…

Bamboo Crafts
ఛత్తీస్‌గఢ్ రాష్టంలో మహాసముంద్ జిల్లాలో గిరిజనులు వెదురు క్రాఫ్ట్ తయారు చేయడం మొదలు పెట్టారు. వాటి నుంచి ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తున్నారు. బుట్టలు, చాపలు, చీపురులు ఇలా ఎన్నో ఇంటిలో అవసరం ఉండే వస్తువులు గిరిజన మహిళలు తయారు చేస్తున్నారు. మహాసముంద్ జిల్లాలోని డెవలప్మెంట్ బ్లాక్ బాగ్‌బహ్రాలో ఛత్తీస్‌గఢ్ స్టేట్ రూరల్ మిషన్ బిహాన్ వాళ్ళు 11 ప్రత్యేక గిరిజన మహిళలతో వెదురుతో బుట్టలు, బొమ్మలు, చాపలు, చీపుర్లు తయారు చేస్తున్నారు.
జిల్లా పంచాయతీ నుంచి 18- 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారు , అక్షరాస్యులైన మహిళలకు వెదురుతో తయారు చేసే వస్తువులకి శిక్షణ ఇస్తున్నారు.వెదురుతో బుట్టలు, స్లింగ్ బ్యాగ్స్, కూరగాయల బుట్టలు వంటి అనేక రకాల వస్తువుల తయారు చేయడంలో శిక్షణ ఇస్తున్నారు. ఇలా తయారు చేసిన వస్తువుల నుంచి మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఇలా మహిళలను కొన్ని బృందాలుగా చేసి వారి నుంచి ఈ వస్తువులని తయారు చేసి అమ్ముతున్నారు. వీటి నుంచి మంచి లాభాలు రావడంతో మహిళలకి ఉపాధి కల్గుతుంది.
Also Read: India Caps Rice Exports: బియ్యం ఎగుమతులు నిషేధం.. విదేశాల్లో ఉన్న భారతీయులకి షాక్…