జాతీయంరైతులువార్తలుసేంద్రియ వ్యవసాయం

Economic Survey 2022: ప్రభుత్వం వ్యవసాయ R&D, సేంద్రియ వ్యవసాయాన్ని పెంచాలి- ఆర్థిక సర్వే

1
Economic Survey 2022
Economic Survey 2022

Economic Survey 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో 2022 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. యూనియన్ బడ్జెట్‌కు ప్రీక్వెల్, ఆర్థిక సర్వే ఒక రోజు ముందే ప్రవేశ పెడతారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా ఆర్ధిక సర్వే 2022 పోయిన సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ ఎలా పురోగమించిందనే అంశంపై వివరణాత్మకతో కూడిన విశ్లేషణను అందించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Economic Survey 2022

Economic Survey 2022

ప్రతి సంవత్సరం లాగానే ఆర్థిక సర్వే 2022 గత సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా పురోగమించిందనే దానిపై వివరణాత్మక విశ్లేషణను అందించింది. ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం, సేవా రంగం కరోనావైరస్ మహమ్మారి వలన తీవ్రంగా దెబ్బతిన్నది, అయితే వ్యవసాయ రంగం COVID-19 ఇచ్చిన షాక్‌కు చాలా దృఢంగా మారింది. అంతేకాకుండా కరోనా మహమ్మారి వలన అతి తక్కువగా ప్రభావితమైన రంగాలలో వ్యవసాయ రంగం ఒకటిగా నిలిచింది.

Also Read: వ్యవసాయ రంగంపై 2021-22 ఆర్ధిక సర్వే

వ్యవసాయం అనుబంధ రంగాలు – పంటలు, పశువులు, అటవీ, లాగింగ్, ఫిషింగ్, ఆక్వాకల్చర్ – గత రెండు సంవత్సరాలలో పుంజుకుని మంచి అభివృద్ధిని చవిచూశాయి. అయితే ఈ రంగాలు 2020-21లో 3.6 శాతం వృద్ధిని సాధించాయి. అంతేకాకుండా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతానికి మెరుగుపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంలో అతిపెద్ద ఉపాధి కల్పించిన రంగాలలో ఈ రంగాలు ఒకటిగా నిలిచాయి. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పశువుల పెంపకం, మత్స్య రంగం ప్రత్యేకంగా ఆశాజనక వృద్ధి స్థాయిలను కనబరిచినట్లు.. అంతేకాకుండా వ్యవసాయ రంగం బాగా పని చేయడంలో సహాయపడిందని ఆర్థిక సర్వే చూపించింది.

రుతుపవనాలు, పెట్టుబడులను మెరుగుపరచడం, రుణ లభ్యతను పెంపొందించడం, మార్కెట్ సౌకర్యాల కల్పన, రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడం, రంగానికి నాణ్యమైన ఇన్‌పుట్‌లను అందించడం వంటివి అనేక ప్రభుత్వ చర్యల వల్ల సాధ్యమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) వంటి పథకాల ద్వారా ఆహార ధాన్యాల అదనపు కేటాయింపుల ద్వారా ఆహార భద్రత నెట్‌వర్క్ కవరేజీని కేంద్రం మరింత విస్తరించడాన్ని సర్వే పత్రం ప్రశంసించింది.

ఆత్మ నిర్భర్ భారత్ AATMA NIRBHAR BHARAT(ANB) అభియాన్‌పై ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యతను ఆర్థిక మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వం పంటల వైవిధ్యం, అనుబంధ వ్యవసాయ రంగాలు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని సర్వే సూచించింది. అంతేకాకుండా కొత్త సాంకేతికతలను ఉపయోగించడంతో పాటు వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి Research and Development (R&D), సేంద్రియ వ్యవసాయాన్ని పెంచాలి అని ఆర్థిక సర్వే తెలిపింది.

Also Read: సేంద్రియ వ్యవసాయంతో వరిలో అధిక దిగుబడి సాధించిన మహిళా రైతు

Leave Your Comments

Economic Survey: వ్యవసాయ రంగంపై 2021-22 ఆర్ధిక సర్వే

Previous article

Damage Orchards: చలి తీవ్రతకు ద్రాక్షతో పాటు అరటి రైతులకు తీవ్ర నష్టం

Next article

You may also like