Crops Damage: నిన్నటి వరకు వర్షాభావంతో అల్లాడిపోయిన రైతులు నేడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వానలకు జలమయం అయ్యాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సరైన సమయంలో పంటలకు వర్షాలు పడకపోవడంతో బోరుబావులు ద్వారా నీరు అందించి పంటలను కాపాడుకుంటే ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలకు నీట మునిగిన పంటలతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. అంతేకాకుండా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు వాగులు పంటలను ముంచెత్తాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
పంటలన్నీ జలమయం
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలతో వేల ఎకరాల్లో పంటకు నష్టం కలిగిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు పలు గ్రామాలన్ని జలమయం అయ్యాయి. వేలాది రూపాయలు పంటలపై పెట్టుబడులు పెట్టారని ఇప్పుడు మొత్తం నీటి పాలు అయ్యిందని రైతులు బోరున విలపిస్తున్నారు. వరి ప్రత్తి, మిరప, కూరగాయలకు పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు నీట మునిగిన పంటలను సర్వే చేసి బాధిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Also Read: Best Farmer Award: జమ్మికుంట రైతుకు బెస్ట్ ఫార్మర్ అవార్డు

Crops Damage
పశువులకు మేతగా పూలు
ఈ భారీ వర్షాలు పూల రైతులకు కూడా నష్టాలను తెచ్చి పెట్టాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో మూడు రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతుండటంతో పూల తోటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు వ్యాపారులు సైతం పూలను కొనడానికి విముఖత చూపడంతో మార్కెట్‌లో ధరలు అమాంతం పడిపోయాయి. శ్రావణ మాసానికి చేతికి అంది వచ్చే విధంగా పూల సాగు చేసిన రైతులకు వానలు స్వాగతం పలుకుతున్నాయి. శ్రావణమాసం ఆరంభంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వ్యాపారులతో మార్కెట్ కిటకిటలాడింది. ప్రస్తుత్తం ఎవరు కొనేవారు లేక చివరికి అవి పశువులకు మేతగా మారాయి. అంతేకాకుండా వానలకు పూల నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Also Read: PM Kisan Scheme: పీఎం కిసాన్ రూ.12000 అందాయా?