జాతీయం

SPMRM Scheme: SPMRM స్కీం ద్వారా మహిళా రైతులకి ఒక కొత్త ఉపాధి..

2
SPMRM Scheme
SPMRM Scheme for Farmers

SPMRM Scheme: మారుతున్న కాలం బట్టి మన అలవాట్లు కూడా మారుతున్నాయి. ఒక్కపుడు తినే జొన్న రొట్టెలు మళ్ళీ తిన్నడం మొదలు పెట్టారు. ఇంటిలో తయారు చేయడానికి శ్రమ ఎక్కువ అవుతుంది. దాని వల్ల ఈ జొన్న రొట్టెలని ఎక్కువగా బయట కొనుకొని తింటున్నారు. జొన్నరొటెలు ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నలో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మార్కెట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ అనుకూలంగా మహబూబ్ నగర్ జిల్లలో గండీడ్ మహిళలు జొన్న రొట్టెల వ్యాపారం మొదలు పెట్టారు.

ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రభుత్వం స్కీం ద్వారా 25 లక్షలు ఋణం తీసుకున్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (SPMRM) స్కీం ద్వారా లోన్ తీసుకున్నారు. గండీడ్ మహిళా ఫార్మర్స్ ఉత్పత్తుల కంపెనీ లిమిట్ ద్వారా ఈ రొట్టెల వ్యాపారం మొదలు పెట్టారు. ఇందులో అందరూ మహిళా సభ్యులే పని చేస్తారు. ఈ రోటి మేకింగ్ మెషిన్ ద్వారా రోజుకి 1000-1500 రొట్టెలు తయారు చేసి అమ్ముతున్నారు.

ఈ మెషిన్ సెమీ ఆటోమేటిక్ రూపంలో పని చేస్తుంది. ఈ మెషిన్ ద్వారా రోజుకి సుమారు 5000 రొట్టెలు తయారు చేయవచ్చు. కానీ మార్కెట్ డిమాండ్, ఆర్డర్ బట్టి తయారు చేసి అమ్ముతున్నారు. ఈ మెషిన్తో తయారు చేసిన రొట్టె 10 ఇంచ్ వ్యాసంతో ఉంటుంది. ఈ రొట్టెలని కోస్గి, మహబూబ్ నగర్, హన్వాడ ప్రాంతాల్లో ఉన్న హోటల్, ధాబాలకి సప్లై చేస్తున్నారు.

ఎక్కువ మొత్తంలో ఆర్డర్ ఉంటే దూరం ప్రాంతాలకి కూడా సప్లై చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఉండే పోటీ బట్టి 5 రూపాయలకి అమ్ముకునే రొట్టె రేట్ తగ్గించి 3-4 రూపాయలు అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్లో 50 రొట్టెలు ఉంటాయి. రొట్టెలు తయారు చేశాక 5-6 గంటలు అరపెట్టాలి.

ఈ రొట్టెలు తయారు చేయడానికి ముందుగా పిండి కల్పడానికి ఒక మెషిన్ ఉంది. కలిపిన పిండిని రోటి మేకింగ్ మెషిన్లో వేస్తే సమానమైన పరిమాణంలో కట్ చేసుకొని వస్తాయి. వీటిని కాల్చడానికి 4 పొయ్యిలు ఏర్పాటు చేసుకొని విటుడిగా కలుస్తారు. జొన్నలు 25 కిలోలు కొన్నాడు 3500 రూపాయలు అవుతుంది. ఒక కిలో పిండితో 25-30 రొట్టెలు తయారు చేయవచ్చు. రొట్టెలు తయారు చేయడానికి తెల జొన్నలు వాడుతున్నారు.

ఈ స్కీం ద్వారా మిల్లెట్స్ మెషినరీ, రైస్ మిల్ మెషినరీ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ రొట్టెల ద్వారా నెలకి 60 వేలు ఆదాయం పొందుతున్నారు. నెలకి ఒక లక్ష రూపాయలు వస్తే 15-20 వేల లాభం ఉంటుంది. దీని ద్వారా ఇప్పుడు అయిదు మంది మహిళలకి ఉపాధి దొరికింది. ఎక్కవ ఆర్డర్స్ వస్తే దురా ప్రాంతాలకి సప్లై చేస్తారు. ఈ రొట్టాలని మీరు కొనుగోలు చేయాలి లేదా ఈ బిజినెస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే 8897099694 నెంబర్ సంప్రదించండి.

Also Read: Korameenu Fish: కొరమీను చేపలు ట్యాంక్లో పెంపకం ఎలా.?

Sundakkai Health Benefits: ఈ కాయ 100 విటమిన్ టాబ్లెట్స్ తో సమానం…

Leave Your Comments

Korameenu Fish: కొరమీను చేపలు ట్యాంక్లో పెంపకం ఎలా.?

Previous article

Coconut Flower: రోజు రోజుకి నగరాల్లో ఈ పువ్వులకి డిమాండ్ పెరుగుతుంది.. రైతులు కూడా మంచి లాభాలు వస్తున్నాయి..

Next article

You may also like