World Food Prize for Scientists 2022: NASA శాస్త్రవేత్త సింథియా రోసెన్‌జ్‌వీగ్ గారికి 2022 ప్రపంచ ఆహార బహుమతిని గెలుచుకున్నారు. ఆమె న్యూయార్క్ లోని NASA సంబంధిత గొడ్దార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ (GISS)లో సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ మరియు క్లైమేట్ ఇంపాక్ట్స్ గ్రూప్ హెడ్ గా సింథియా రోసెన్‌జ్‌వీగ్ పని చేస్తున్నారు. వాతావరణ మార్పు గురించి ఆమె చేసిన పరిశోధనలకు గాను మే 5న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నుండి 20 ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు.

Cynthia Rosenzweig – World Food Prize Laureate 2022
వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంటే ఏంటి ?
వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది వ్యవసాయ అనుబంధ రంగాలకు అందించే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు. ఇది “ఆహారం మరియు వ్యవసాయం రంగంలో నోబెల్ బహుమతి”గా పరిగణించబడుతుంది. ఇది నూతన ఆవిష్కరణలను ఉన్నతీకరించడానికి, అందరికీ నాణ్యమైన ఆహారం, దాని పరిమాణంను, లభ్యతను స్థిరంగా పెంచడానికి అనునిత్యం పాటిపడుతున్నది.
Also Read: Status of Indian Organic agriculture 2021-22: సేంద్రియం వైపు భారత్ మొగ్గు
ప్రస్తుత వాతావరణ మార్పులు మరియు ఆహార వ్యవస్థల మధ్య సంబంధం అర్థం చేసుకోవడానికి, రాబోయే రోజుల్లో అవి రెండూ ఎలా మార్పు చెందుతాయో అంచనా వేయడానికి ఆమె చేసిన పరిశోధనకు గానూ రోసెన్‌జ్‌వీగ్ గారు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికయ్యారు. వాతావరణ మార్పులను తగ్గించి, మారుతున్న ఆహార వ్యవస్థలను స్వీకరించడానికి వ్యూహాలను రూపొందించి ఆహార భద్రత కల్పించే ప్రయత్నాలు మెచ్చుకొదగినవి.

World Food Prize Laureate 2022
“ఈ సంవత్సరం ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను మరియు చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాతావరణ మార్పుల వలన ఆహార వ్యవస్థ పైన ప్రభావం అనేది కీలకమైన అంశంగా అభివృద్ధి చెందుతున్నాయి” అని రోసెన్‌జ్‌వీగ్ వివరించారు.సింథియా రోసెన్‌జ్‌వీగ్ సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ మరియు NASA GISSలో క్లైమేట్ ఇంపాక్ట్స్ గ్రూప్ కు హెడ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోసెన్‌జ్‌వీగ్ 2007లో ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) వర్కింగ్ గ్రూప్ II ఫోర్త్ అసెస్‌మెంట్ రిపోర్ట్ మరియు 2019లో క్లైమేట్ చేంజ్ మరియు ల్యాండ్‌పై IPCC స్పెషల్ రిపోర్ట్‌కు సమన్వయ ప్రధాన రచయితగా ఉన్నారు. అగ్రికల్చరల్ మోడల్ ఇంటర్‌కంపారిజన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (AgMIP)కు సహ వ్యవస్థాపకురాలు.
Also Read: Chicken Price: బ్రాయిలర్ కోడి మాంసం ధరలు పెరగడానికి కారణాలివే