ప్రకృతి అనుకూలించకపోతే వ్యవసాయంలో తీరని నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అది భారతదేశం అయినా ఇతర దేశాలు అయినా ఈ ముప్పు ఎదుర్కోక తప్పదు. ఈశాన్య భారతదేశంలో ఉన్న నాగాలాండ్ పరిస్థితి దయనీయంగా మారింది. నాగాలాండ్ లో ఎక్కువగా వరిని సాగు చేస్తారు. అయితే వర్షపాతంలో మార్పుల కారణంగా రైతులు వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఏడాది లోటు వర్షపాతం కారణంగా కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నీటిని నిల్వ చేయడానికి ఎలాంటి యంత్రాంగం లేకపోవడం, వారి పొలాలకు నీటి సరఫరా కోసం నదులు మరియు వాగులపై ఆధారపడటమే కారణం. అయితే ఈ ఏడాది నీటి వనరులు ఎండిపోవడంతో చాలా మంది రైతులు వరి నాట్లు వేయలేకపోయామని ఆవేదన చెందారు 35 సంవత్సరాల సెయి కుట్సు. నేను కొన్నేళ్లుగా వరి పండిస్తున్నాను. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోలేదని చెప్తున్నాడు కోహిమా జిల్లాలోని ఝద్మియా గ్రామ వాసి డిలెజో మ్కెబిట్సు.
ఒక్క ఝాదిమాలో వ్యవసాయం చేస్తున్న సుమారు 800 కుటుంబాలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాయని వీరిద్దరూ పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రమంతా ఈ ఏడాది తీవ్ర కరువుతో అల్లాడుతోంది. నాగాలాండ్ వ్యవసాయ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 66,222 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ప్రభావితమైన మొత్తం భూభాగం దాదాపు 49,448.85 హెక్టార్లు. దిమాపూర్ జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది. 9,408 గృహాలు మరియు 14,995 హెక్టార్ల భూమి తీవ్రంగా దెబ్బతిన్నది. పప్పుధాన్యాలు, కూరగాయలు, నూనెగింజలు, గుమ్మడికాయలు కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయని రైతులు తెలిపారు.ఈ సంక్షోభం రాష్ట్రంలో ఝుమ్ ఫార్మింగ్ పై కూడా ప్రభావం చూపింది. వర్షాల కొరత వరి నాణ్యతను కూడా ప్రభావితం చేసింది. కరువు కారణంగా రాజు మిర్చి దెబ్బతింది. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు అని కోహిమా జిల్లాలోని రైతు కెనీ వెలి తెలిపారు.
నాగాలాండ్ మొత్తం వైశాల్యం 16,579 చదరపు కిలోమీటర్లు, అందులో 947 చదరపు కిలోమీటర్లు ఝుమ్ సాగులో ఉన్నాయి. ఝుమ్‌తో పాటు, టెర్రస్డ్ రైస్ ఫార్మింగ్ మరియు తడి టెర్రస్ వరి సాగు కూడా దెబ్బతింది. రాష్ట్రం 2020లో 551,000 టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా ఈ ఏడాది 166,000 టన్నులు ఉంటుందని అంచనా. ఈ నష్టంపై అక్కడి వ్యవసాయ అధికారి కియేటో సెమా స్పందించారు.
మా సంప్రదాయ సాగు విధానం ఆర్థికంగా లాభదాయకం కాదని, పర్యావరణపరంగా నిలకడగా ఉండదని అయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోతోందని, దీనిపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలు కోరారు. చెక్ డ్యాంలు, రిజర్వాయర్ల నిర్మాణంపై కేంద్రప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. ఇది నీటి వనరులను పునరుద్ధరించాలి, అన్నారాయన.
#NagalandFarmers #DeficientRains #Nagalanddrought #agriculturenews #eruvaaka