- వ్యవయసాయం మరియు గ్రామీణాభివృద్దిలో నాబార్డ్ ముఖ్యభూమిక ….
- స్వర్ణాస్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట……
- రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ వ్యవసాయం….అమరావతిలో నాబార్డ్ ఐకానిక్ భవనం….
- కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం….
- గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైంది…
రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక ,పాడి పరిశ్రమాభివృద్ధి
మరియు మత్స్యశాఖా మాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు.
గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాకార కార్యక్రమాలపై ప్రత్యక శ్రద్ధ వహించి రాష్టాభివృధికి నాబార్డ్ తనవంతు కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ ,సహకార, మార్కెటింగ్, పశుసంవర్డక,పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు . ఈ మేరకు బుధవారం విజయవాడలోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్ లో నేషనల్ బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక,ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్ ,నాబార్డ్ చైర్మన్ షాజీ కెవి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ ,పశుసంవర్డక పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు. మాట్లాడుతూ …. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డ్ విశేష కృషి చేస్తుందన్నారు.
స్వర్ణాంధ్ర -2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయనికి 45 వేల కోట్ల కేటాయించడం జరిగిందన్నారు . రాష్ట్రంలో వ్యవసాయం అనుబంధ రంగాల ,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయడం లో నాబార్డ్ కీలక పాత్ర పోషిస్తుందిన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అనుబంధ రంగాలు 64శాతం, రాష్ట్ర జిడిపిలో నాబార్డ్ 34శాతం,ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతిని తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉన్న నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతిలో నిర్వహించే నాబార్డ్ శాశ్వత ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే భూమిని కేటాయించడం జరిగిందని, దేశంలోనే ఎక్కడలేని విధంగా అన్ని రకాల సదుపాయాలతో ఒక ఐకానిక్ ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు . వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని, కౌలు రైతులను అదుకునేందుకు ప్రత్యేక చట్టం అమలు చేస్తామన్నారు. ఫిషరీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఎగుమతులను మరింత ప్రోత్సహిస్తున్నామన్నారు. డ్రోన్ల తో వ్యవసాయం చేసేలా కుటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే 40,వేల డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. నాబార్డ్ బ్యాంకింగ్ సెక్టార్ ప్రభుత్వానికి సహకరించి రాష్టాభివృధికి తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.
రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మాత్యులు పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ …. నాబార్డ్ సహాయంతో ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్టులన్నింటినీ ప్రారంభించిన మంజూరైన రుణాలను సద్వినియోగం చేసుకునేందుకు సంబంధింత అన్ని ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని సూచించారు. భారత్ అతివేగంగా అభివృద్ధిపలో చెదుతుందని, నాబార్డ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకొంటుందన్నారు. బ్యాంకింగ్ నెట్ వర్కును బలోపేతం చేయడానికి మరియు సమ్మిళిత బ్యాంకింగ్ ను ప్రోత్సాహించడానికి నాబార్డ్ విశేష కృషి చేస్తుందని,స్వయం ఉపాధి పెంపొందించడం,చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటులో నాబార్డ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.
నాబార్డ్ చైర్మన్ షాజి కెవి మాట్లాడుతూ…. నాబార్డ్ ద్వారా సహాయం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. నాబార్డ్ సంబంధిత శాఖలు,ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో నిరంతరం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు . సాంకేతిక
పరిజ్ఞాన్నాని స్వీకరించడం మరియు ఆర్థిక సమ్మిళితం చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ముందంజలో ఉంటారన్నారు.
నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ ఎం .ఆర్. గోపాల్ మాట్లాడుతూ ….. గ్రామీణ భారతానికి సేవ చేయడంతో పాటు వ్యవసాయం మరియు గ్రామీణ శ్రేయస్సుకు నాబార్డ్ తను నిబద్దతను నెరవేరుస్తోదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడిద రాజశేఖర్ ,సహకారశాఖ సెక్రటరీ
ఎ .బాబు, ప్రభుత్వ కార్యదర్శి డి రోనాల్డ్ రోస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ తదితరు శాఖల అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు. స్పెషలిస్ట్ సెక్రెటరీ బూడితి రాజశేఖర్, సహకార సెక్రటరీ ఏ బాబు ప్రభుత్వ కార్యదర్శి డి రోనాల్డ్ రోజ్ లను నాబార్డ్ చైర్మన్ షాజి కెవి పొందూరు కాదు కండువా జ్ఞాపకలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం….. మంత్రులు అచ్చెన్నాయుడు ,పయ్యావుల కేశవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి.రాజశేఖర్, సహకారశాఖ సెక్రెటరీ ఎ.బాబు ప్రభుత్వ కార్యదర్శి
డి. రోనాల్డ్ రోజ్ లను నాబార్డ్ చైర్మన్ షాజి కెవి పొందూరు ఖాదీ కండువా, జ్ఞాపకలతో ఘనంగా సత్కరించారు.
Leave Your Comments