NABARD Chief Visits PJTSAU Research Arms నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ముందుగా ఆయన అగ్రిహబ్ ఇన్నోవేషన్ సెంటర్‌లో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ఉపకుపలతి డా:వి.ప్రవీణ్ రావుతో కలిసి సమావేశం అయ్యారు. తర్వాత విశ్వవిద్యాలయ పరిధిలోని మిల్లెట్ ఇంకుబేషన్ సెంటర్, ఏఆర్ క్యాంపస్లోని వరి పరిశోధనా కేంద్రంను సందర్శించారు. ఉపకులపతి డా:వి.ప్రవీణ్ రావు వరి సెంటర్లో జరుగుతోన్న పరిశోధనలను నాబార్డ్ ఛైర్మను వివరించారు.
వరిసాగులో వివిధ దశలలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంకు సంబంధించి పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు గోవిందరాజులుకు వివరించారు. డ్రోన్ సహాయంతో పురుగుమందుల పిచికారి, వరి రకాల సాగు విస్తీర్ణం అంచనావేయడం, తెలంగాణ సోనా సాగుకు సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు వివరించారు. డ్రోన్ ద్వారా వరి వెదజల్లే పద్దతి లైవ్ డెమాన్ స్టేషను ఆయన తిలకించారు. వరి పంటకు సంబంధించి విశ్వవిద్యాలయం అభివృద్ధి పరచిన రకాలను, అభివృద్ధి పరచబోతోన్న రకాలను గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. వరిలో డ్రోన్ వినియోగంతో సమయం, ఖర్చు ఎంత వరకు ఆదా అవుతుందని శాస్త్రవేత్తలను ఆయన అడిగి ఆయన తెలుసుకున్నారు. డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవల గురించి ఉపకులపతి ప్రవీణ్ రావు ఆయనకు వివరించారు. ఈ పర్యటనలో తెలంగాణ ప్రాంత నాబార్డ్ సిజిఎం వైకె.రావుతోపాటు పరిశోధనా సంచాలకులు డా:ఆర్.జగదీశ్వర్ కూడా పాల్గొన్నారు. Nabard Chief Govindarajulu