ఆంధ్రప్రదేశ్వార్తలు

Acharya N.G. Ranga Agricultural University: డ్రోన్ల వినియోగంలో శిక్షణకు పరస్పర సహాయ సహాకారాలు.!

3
Acharya N.G. Ranga Agricultural University
Acharya N.G. Ranga Agricultural University

Acharya N.G. Ranga Agricultural University: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరులోని పాలకవర్గ సమావేశ మందిరం సభ్యుల సమావేశ మందిరము నందు ఈరోజు అనగా 18 నవంబర్ 2022 న M/s. పాసేంజర్ బ్రోస్ రిసెర్చ్ ప్రైవేటు లిమిటెడ్ (PDRL) మరియు ఆచార్య ఎస్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య పరిశోధన, బోధన సిబ్బంది మరియు విద్యార్థులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణకు పరస్పరము సహాయ సహాకారాలు అందించడం, డ్రోన్ ద్వారా precision farming ను ‘Aero Megh platform’ ను వినియోగించి ప్రచారం చేయడం, పురుగులు మరియు తెగుళ్ళు గుర్తించడము, అంగు పుష్పక్ సిరీస్ వ్యవసాయ డ్రోన్లకు సహాయ పడడము మొదలగు విషయాల మీద అవగాహనా ఒప్పందం జరిగింది.

Acharya N.G. Ranga Agricultural University

Acharya N.G. Ranga Agricultural University

ఈ కార్యక్రమములో వ్యవసాయ విశ్వవిద్యాలయము నుండి విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డా. ఆదాల విష్ణు వర్దన్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ డా. జి. రామారావు గారు, పరిశోధన సంచాలకులు డా. ఎల్. ప్రశాంతి గారు, విస్తరణ సంచాలకులు డా. పీ. రాంబాబు గారు, వ్యవసాయ విద్య పీటాధిపతి డా. ఎ. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ ఇంజినీరింగ్ పీఠాధిపతి డాక్టర్ ఏ. మణి గారు, సామాజిక విజ్ఞాన పీఠాధిపతి డాక్టర్ సి. హెచ్. చిరంజీవి గారు, విద్యార్ధి కార్యకలాపాల పీటాధిపతి డా. పీ. సాంబశివరావు గారు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి. సుధాకర్ గారు, విశ్వవిద్యాలయ కంట్రోలర్ డాక్టర్ ఏ. వి. రమణ గారు, డ్రోన్ పరిశోధనా విభాగం సీనియర్ శాస్త్రవేత్త డా. ఎ. సాంబయ్య గారు తదితరులు పాల్గొన్నారు.
M/s. పాసేంజర్ డ్రోన్ రిసెర్చ్ ప్రైవేటు లిమిటెడ్ (PDRL) నుండి శ్రీ. అనిల్ చాన్డిలియా గారు మరియు వారి టీం పాల్గొన్నారు.

Also Read: Acharya N.G. Ranga Agricultural University: లాం ఫారం లో డిసెంబర్ నుండి ప్రారంభం కానున్న ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు.!

Must watch:

Leave Your Comments

Chia Seeds Health Benefits: చిన్నగా ఉండే చియా విత్తనాలతో చెప్పలేనన్ని ప్రయోజనాలు.!

Previous article

Medical Education: ప్రజల వద్దకే వైద్యం – అందుబాటులో వైద్యవిద్య.!

Next article

You may also like