తెలంగాణవార్తలు

PJTSAU: ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి ప్రారంభించిన PJTSAU ఉపకులపతి.!

2
MS Swaminathan Annexe inaugurated by PJTSAU Vice-Chancellor
MS Swaminathan Annexe inaugurated by PJTSAU Vice-Chancellor

PJTSAU: గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం తో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనలకి అవసరమైన మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పిస్తున్నామని ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అన్నారు. ఈ విషయంలో దేశంలోని ప్రముఖ వ్యవసాయ విద్యాలయాలు, సంస్థల సరసన నిలబడగలుగుతున్నామని ఆయనన్నారు. ఈ సదుపాయాల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని రైతాంగం, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలని ఆయన శాస్త్రవేత్తలు, పరిశోధకులకి సూచించారు.

MS Swaminathan Annexe inaugurated by PJTSAU Vice-Chancellor

MS Swaminathan Annexe inaugurated by PJTSAU Vice-Chancellor

PJTSAU పరిధిలో రాజేంద్రనగర్ లోని అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధుల సాయంతో నూతనంగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ హెల్త్ మేనేజిమెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ కాంప్లెక్స్ ని ఆయన ఈ రోజు ప్రారంభించారు.

MS Swaminathan Annexe inaugurated by PJTSAU Vice-Chancellor Dr. Praveen

MS Swaminathan Annexe inaugurated by PJTSAU Vice-Chancellor Dr. Praveen

ఈ కాంప్లెక్స్ కి ప్రముఖ ప్రపంచ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్త “డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి” అని నామకరణం చేశారు. అనంతరం ఈ రెండు ఫ్లోర్ ల కాంప్లెక్స్ అంతా ఉపకులపతి కలియతిరిగారు. ల్యాబ్ లని ప్రారంభించారు. శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ కి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.

Leave Your Comments

Coconut Nut Rot Disease: కొబ్బరిలో కాయకుళ్ళు తెగులు యాజమాన్యం.!

Previous article

Cotton Cultivation: ప్రత్తి పంట లో వర్షాలు తగ్గిన తర్వాత రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

Next article

You may also like