Kisan Credit Card: కేసీసీ పథకం కింద గత రెండేళ్లలో 2.92 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. ఈ పథకానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ని లింక్ చేస్తున్న విషయం తెలిసిందే. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా చౌకైన రుణం లభిస్తుంది. దీనిపై తీసుకున్న రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలపై వడ్డీ రేటు 9 శాతం. కానీ ప్రభుత్వం ఇందులో 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మరియు వడ్డీని సకాలంలో తిరిగి ఇస్తే మరో 3% తగ్గింపు ఉంటుంది.
మొత్తంమీద నిజాయితీగా ప్రభుత్వ సొమ్మును తిరిగి ఇచ్చే రైతులకు సంవత్సరానికి కేవలం 4% వడ్డీ రేటుతో వ్యవసాయం కోసం రూ.3 లక్షల వరకు రుణాలు లభిస్తాయి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు రూ.3.20 లక్షల కోట్ల రుణ పరిమితిని అందించారు. అంటే ఈ రైతులు వ్యవసాయం కోసం ఏటా రూ.3.20 లక్షల కోట్లు ఖర్చు చేయవచ్చు.
ఇప్పుడు ఇది పశుపోషణ మరియు మత్స్య సంపద కోసం కూడా జారీ చేయబడింది. దీని పరిమితి రూ. 2 లక్షలు. కాగా అర్హులైన రైతుల నుంచి కేసీసీ దరఖాస్తు ఫారాలను సేకరించి అందులో సేకరించిన దరఖాస్తులను బ్యాంకు శాఖకు సమర్పించేందుకు బ్యాంకుల వారీగా, గ్రామాల వారీగా క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. పూర్తి చేసిన దరఖాస్తును స్వీకరించిన 14 రోజులలోపు KCC జారీ చేయబడుతుంది.
ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (pmkisan.gov.in) వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇక్కడ డౌన్‌లోడ్ కిసాన్ క్రెడిట్ ఫారమ్ ఆప్షన్ ఫార్మర్స్ కార్నర్‌లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని పూర్తిగా పూరించండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఫోటోకాపీని జత చేయండి. అఫిడవిట్ కూడా పెట్టండి, ఆ తర్వాత దగ్గరలోని బ్యాంకులో డిపాజిట్ చేయండి.