నల్గొండ జిల్లా కనజాల మండంలోని చిన్న రాజారం గ్రామంలో చిట్టి మల్ల రాములు గారు 15 సంవత్సరాల నుండి ఆకుకూరల సాగు చేస్తున్నారు. వరి సాగులో ఎంత చేసిన పెట్టుబడి కూడా రాకపోడంతో వరిసాగును మానేసి పాలకూర, మెంతికూర, తోటకూర, గోంగూర, పుదీనా ఆకు కూరలు సాగు చేస్తూ మంచి లాభాల్ని పొందుతున్నాడు. ఆకు కూరల్లో పుదీనా సాగులో రాములు మంచి నైపుణ్యం సాధించాడు. అర ఎకరాలో పుదీనా నాటాడు. పుదీనా ఒక్కసారి నాటితే 5 సంవత్సరాల వరకూ పంటను పొందవచ్చు. సంవత్సరానికి 10 వేలు పెట్టుబడి పెడితే 3 లక్షల వరకు లాభాల్ని పొందవచ్చు అని రైతు రాములు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
Leave Your Comments