Thummala Nageswara Rao: రాష్ట్రంలో పెసర పంటను పండించిన రైతులకు మద్దతు ధర లభించేవిధంగా మార్క్ ఫెడ్ ద్వారా ఈరోజు నుంచి (ఆగష్టు 30 నుంచి) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి,పెసర పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వానాకాలంలో 64,175 ఎకరాల్లో పెసర పంట సాగయింది.17,841 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా. ప్రస్తుతానికి 12 ప్రాంతాల్లో పంటకోతకు వచ్చిందని, మార్కెట్ కు పెసర పంట అమ్మకానికి వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించిన ప్రాంతాల్లో కేంద్రాలను వెంటనే ఏర్పాటుచేసి, కొనుగోళ్ళను ప్రారంభించాలి. ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని మార్క్ ఫెడ్ అధికారులకు సూచించారు.అదేవిధంగా కొనుగోలు సెంటర్లలో రైతులకు మార్క్ ఫెడ్ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించాలి. రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యత ప్రమాణాలను పాటించి పెసర పంటకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 8,682 పొందాలని మంత్రి విజ్ఙప్తి చేశారు.

Thummala Nageswara Rao
Also Read:Minister Atchannaidu: పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు