అంతర్జాతీయంవార్తలు

బాయిల్డ్‌ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం చేశారు: కేంద్ర మంత్రి గోయల్

0
Minister Piyush Goyal
  • నేను లేనప్పుడు మంత్రుల ఢిల్లీ పర్యటన ఎందుకు

  • ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ అసత్యాలు

  • తెలంగాణ రైతుల్ని కేసీఆర్ సర్కార్ నట్టేట ముంచుతుంది

  • తెలంగాణ రైతులకు మోడీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది

cm kcr

Minister Piyush Goyal :తెలంగాణ యాసంగి పంట సేకరణ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అనంతరం ఆయన తెలంగాణ ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ రైతుల్ని గందరగోళానికి గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఢిల్లీలో లేని సమయంలో తెలంగాణ మంత్రులు ఢిల్లీకి ఎందుకు వచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యాన్ని సేకరించామని చెప్పిన గోయల్, ఇప్పటివరకు 5 రేట్లు పెంచినట్లు అయన తెలిపారు. గత రబీ సీజన్లో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరిందని, అయితే ఇప్పటికే నాలుగు సార్లు గడువు పెంచినప్పటికీ ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ఎందుకు తరలించలేదని మంత్రి ప్రశ్నించారు. Telangana CM KCR

Minister Piyush Goyal

Minister Piyush Goyal ఇప్పటికీ 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ,13 లక్షల టన్నుల రారైస్ ఇవ్వాల్సి ఉంది. తెలంగాణకు స్పెషల్ కేస్ కింద 20 లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్ రైస్ కు అనుమతి ఇచ్చామని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ సర్కార్ అబద్దాలు చెప్తూ రైతుల్ని గందరగోళానికి గురి చేస్తుందని ధ్వజమెత్తారు. ఇక ఖరీఫ్ ఎంత రా రైస్ ఇచ్చినా తీసుకుంటామని ఎన్నోసార్లు చెప్పామని అయితే ఈ ఐదేళ్లలో మూడు రేట్లు ఎక్కువే సేకరించామని తెలిపారు. మరోవైపు నాలుగేళ్లకు సరిపడ బాయిల్డ్ రైస్ ఉందని, అయినా కేంద్రం బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పినట్టు మంత్రి తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పీయూష్ గోయల్ మీడియా సమావేశంలో తెలిపారు.

kishan reddy

మంత్రి గోయల్ మీడియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి Kishan Reddy మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రెండు నాలుకల ధోరణిని తప్పు పట్టారు. గత రబీలో సీఎం కేసీఆర్ ధాన్యాన్ని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని తెలంగాణ ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తు చేశారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ కలిపి 27.39 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరా చేయాలన్నారు. ఎఫ్‌సీఐకి ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు.సీఎం కేసీఆర్‌ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. Telangana Paddy Issue

Leave Your Comments

గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న వంటనూనె ధరలు

Previous article

రైతుల కోసం మొబైల్ యాప్స్

Next article

You may also like