వార్తలు

పంటల మద్దతుధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

0

శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్ లో శుక్రవారం పంటల మద్దతుధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు(Singireddy Niranjan Reddy), హాజరైన  ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు(Alu Venkateshwar Reddy), మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి గారు (Lakshmi Bhai)నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులు పంటలకు మద్దతు ధర పొందాలి. పత్తిలో తేమ 8 శాతం నుండి 12 శాతం ఉండాలి.

  • తేమ 8 శాతానికి లోబడి ఆరు, ఏడు శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ ధర
  • తేమ 8 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర క్వింటాలుకు రూ.6025, పింజరకానికి రూ.5925
  • తేమ 9 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.5964.75, పింజరకానికి రూ.5865.75
  • తేమ 10 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.5904.50, పింజరకానికి రూ.5806.50
  • తేమ 11 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.5844.25, పింజరకానికి రూ.5747.25
  • తేమ 12 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.5784, పింజరకానికి రూ.5688
  • తేమ 6 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర క్వింటాలుకు రూ.6025 కి అదనంగా రూ.120.50, పింజ రకానికి రూ.5925కి అదనంగా రూ.118.50
  • తేమ 7 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర క్వింటాలుకు రూ.6025 కి అదనంగా రూ.60.25, పింజ రకానికి రూ.5925కి అదనంగా రూ.59.25 అదనంగా చెల్లిస్తారు
  • వరి ధాన్యం సాధారణ రకానికి క్వింటాలుకు మద్దతుధర రూ.1940, ఎ గ్రేడ్ రకానికి రూ.1960, కందులు రూ.6300, పెసర్లు రూ.7275, వేరుశెనగ రూ.5550, మినుములు రూ.6300, పొద్దుతిరుగుడు రూ.6015, నువ్వులు రూ.7307, జొన్నలు రూ.2738, రూ.2758, సజ్జలు రూ.2250, రాగులు రూ.3377 గా నిర్ణయించారు
  • ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు తక్షణం అందుబాటులోకి వస్తాయని, రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటలు శుభ్రపరచి, ఎండబెట్టి మార్కెట్ కు తీసుకురావాలి
  • రైతుల సౌకర్యార్ధం మార్కెట్ యార్డులలో ప్యాడి క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయింది
  • వ్యవసాయ వృద్దిరేటులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది
  • తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి అయోగ్ ఇచ్చిన నివేదికనే దీనికి సాక్ష్యం
  • 6.59 శాతం వృద్దిరేటుతో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలవగా పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమస్థానంలో ఉంది
  • సాగునీటి సదుపాయాల కల్పన, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ సరఫరా, రైతుబంధు, రైతుభీమా వంటి వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా తెలంగాణ రైతాంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మవిశ్వాసం నింపారు
  • అందుకే పంటల ఉత్పత్తిలో ప్రతి ఏటా తెలంగాణ రికార్డులు తిరగరాస్తుంది
  • రైతు రెక్కల కష్టానికి తగిన ఫలితం రావాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం
Leave Your Comments

ఇంటర్నేషనల్ కాఫీ డే – కాఫీ వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు

Previous article

నాటుకోళ్ల పెంపకంలో అధిక లాభాలు ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు..

Next article

You may also like