Minister Niranjan Reddy Speech at Palm Oil Samit తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కన్నా ముందే తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులేశామని, 2014-2015 లో 122 లక్షల ఎకరాలు ఉన్న సాగు 2020-21 కి 203 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు మంత్రి. 2014-2015 లో 68.2 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం దిగుబడి 2020-21కి 259.2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. సాగు నీటి వసతిని పెంచడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు పెరిగిందని అభిప్రాయపడ్డారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున .. ఏడాదికి రెండు సార్లు ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఎనిమిది విడతలలో రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతుందని అన్నారు. Minister Niranjan Reddy
కేంద్రం వంటనూనెల దిగుమతి కోసం ఏటా రూ.లక్ష కోట్లు వెచ్చిస్తున్న పరిస్థితిని అంచనా వేసి తెలంగాణ ఆయిల్ పామ్ వైపు దృష్టి సారించింది. పామాయిల్ దేశీయ డిమాండ్ కు తగినట్లుగా ఉత్పత్తి సాధించాలంటే దేశంలో ఇంకా 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలి. తెలంగాణలో ఆయిల్ పామ్ గెలలు అత్యధిక నూనె ఉత్పత్తి శాతం కలిగి ఉన్నవి .. దేశంలో అత్యధికంగా 19.22 శాతం నూనె ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ పథకం కింద రాబోయే ఐదేళ్లలో కేంద్రం 1.12 లక్షల ఎకరాలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నదని అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న అయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) కింద ఆమోదించి నిధులు కేటాయించాలని తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (FFB) ధర టన్నుకు రూ.15000 కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి రైతులను ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలన్నారు. Palm Oil Samit
హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) బిజినెస్ సమ్మిట్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ డిమాండ్లపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రతిష్టాత్మక ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్ ను హైదరాబాద్ లో జరిపినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి. కాగా.. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి , కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. Telangana Agriculture News