తెలంగాణవార్తలు

Minister Niranjan Reddy: వడ్లు కొనుగోలు విషయంలో రాజకీయ రగడ

0
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: వడ్లు కొనుగులు అంశంలో తెలంగాణాలో రాజకీయ వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ అధికార నాయకులకు, బీజేపీ నేతలకు మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా సీఎం కెసిఆర్ వడ్లు కొంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా రెండు పార్టీల మధ్య మాటల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయం శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.

paddy

తెలంగాణలో యాసంగిలో పండే బాయిల్డ్, రా రైస్ ప్రతి గింజా కొనిపించే బాధ్యత నాది అని కిషన్ రెడ్డి చెప్పింది నిజం కాదా ? వడ్ల కొనుగోళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం ? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది.. కొనిపించే బాధ్యత నాది. రైతులు వరి సాగు చేయాలని బండి సంజయ్ చెప్పింది నిజం కాదా ? ఆ తర్వాత రా రైస్ .. బాయిల్డ్ రైస్ పేరుతో రాజకీయం చేసింది నిజం కాదా ? ఇప్పుడు ధాన్యం కొనుగోలు మా ఘనత అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ? అని మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

తెలంగాణ రైతులకు ఇస్తున్న సాగునీళ్లు, రైతుబంధు, 24 గంటల ఉచిత కరంటు, రైతుభీమా పథకాలలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఆఖరుకు పంటలు సేకరించాల్సిన బాధ్యత నుండి కూడా కేంద్రం తప్పించుకుంటే తెలంగాణ రైతాంగం తరపున కనీసం ప్రశ్నించలేని మీరు ఈ ప్రాంత ప్రతినిధులా ? అసలు మీకు ప్రజలను వంచించే హక్కు ఎవరిచ్చారంటు చురకలంటించారు మంత్రి.

Minister Niranjan Reddy

దక్షిణ భారతదేశంలో 5వ శక్తిపీఠంగా ఉన్న అలంపూరు జోగుళాంబ అమ్మవారి ఆలయం పరిసరాలు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏ అభివృద్ది పనిని చేపట్టలేకపోతున్నది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్దికి కేంద్రం నుండి అనుమతులు తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్టను రూ.1200 కోట్లతో పునర్నిర్మించినట్లుగా కనీసం రూ.500 కోట్లు కేంద్రం ద్వారా తీసుకువచ్చి జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ది చేయిస్తాం అని వాగ్దానం చేసే దమ్ముందా అని అని ప్రశ్నించారు. యాదాద్రిని కేసీఆర్ దేశంలో ఒక దివ్యమైన క్షేత్రంగా తీర్చిదిద్దారు. నిత్యం దేవుడి పేరు మీద ఓట్లు దండుకునే మీరు కనీసం దక్షిణ కాశీ అమ్మవారి ఆలయాన్ని అయినా అభివృద్దిపరచగలరా ? తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన జోగుళాంబ బరాజ్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా కేంద్రం నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అనుమతులు తీసుకురాగలరా ?

దశాబ్దాలుగా పాలమూరు, కందనూలు, గద్వాల ప్రాంత ప్రజల కల గద్వాల – మాచర్ల రైల్వే లైన్ ను దేశంలో అన్నిచోట్లా కేంద్రం నిర్మిస్తున్నట్లు .. ఇక్కడ కూడా నిర్మించేలా కేంద్రం నుండి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తాం అని చెప్పే ధైర్యం ఉందా. ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పాదయాత్ర చేయాలి .. ప్రజలను మభ్యపెట్టి, అబద్దాలతో కాలం వెళ్లదీసే తప్పుడు పనులు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హితవు పలికారు 2014 పాలమూరు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నరేంద్రమోడీ స్వయంగా చెప్పింది నిజం కాదా ? దానిని తెలంగాణ ప్రభుత్వం సొంతంగా చేపట్టింది నిజం కాదా ? అని నిరంజన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

kishan reddy

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం పావలా ఇయ్యనిది నిజం కాదా ? కనీసం ఈ ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నడయినా తెలంగాణ బీజేపీ నేతలు నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా ? ఇదే మీకు ఉమ్మడి పాలమూరు జిల్లా మీద ఉన్న ప్రేమనా ? నడిగడ్డకు, ఉమ్మడి పాలమూరుకు నష్టం కలిగించే కర్ణాటకలోని అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఎందుకు ఇవ్వదు ? బండి సంజయ్ కిషన్ రెడ్డిలు ఎందుకు నోరు తెరిచి అడగరు ? ఏడేళ్లుగా కృష్ణా నదిలో నీటి వాటాలు తేల్చకపోవడమే మీ గొప్పతనమా ? కృష్ణా నది వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు పేరుతో కుట్రలు చేస్తున్నది నిజం కాదా ? తెలంగాణ నీటి వనరులను గుప్పిట పట్టాలని భావిస్తున్నది నిజం కాదా అంటూ ప్రశ్నల తూటాలు పేల్చారు.

Leave Your Comments

Sea Weed Uses: సముద్ర నాచు ఉపయోగాలు -పెంపకంలో మెళకువలు

Previous article

Micro -Irrigation: ఆధునిక వ్యవసాయానికి సూక్ష్మ నీటిపారుదల

Next article

You may also like