వార్తలు

నష్టపోయిన మిర్చి రైతుల్ని ఆదుకుంటాం…

0
Minister Kannababu

Minister Kannababu Review Meeting On Loss Of Mirchi Crop రైతుల క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పని చేస్తున్నారన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. గుంటూరు డిసిసిబి లో సమీక్ష నిర్వహించిన మంత్రి కన్నబాబు మాట్లాడుతూ… రైతుల ఆర్ధిక ప్రయోజనాల కోసం సహకార రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. సహకార శాఖను అన్ని రకాలుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రైతు సంక్షేమం కోసం ఏర్పడిన సహకార సంఘాలు మరియు సహకార బ్యాంకులు అత్యంత పారదర్శకంగా పని చేయాలని సూచించారు మంత్రి.

mirchi farmers

Guntur Mirchi Farmers బలమైన ఆడిటింగ్, కంప్యూటరీకరణ, మానవ వనరుల పాలసీ, ఉద్యోగుల్లో బాధ్యత యుతమైన జవాబుదారీతనం వంటి పలు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపడాలి. అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రి కన్నబాబు. అంతకుముందు గుంటూరులో దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు. గుంటురు జిల్లా పత్తిపాడు మండలం కొండైపాడు లోని దెబ్బతిన్న మిర్చి పంట పొలాల రైతులతో మాట్లాడారు మంత్రులు కన్నబాబు, సుచరిత, అధికారులు , శాస్త్రవేత్తలు. cm ys jagan

Minister Kannababu

Minister Kannababu On Mirchi Crop రైతులను సీఎం జగన్ తప్పకుండా ఆదుకుంటారని చెప్పారు మంత్రి కన్నబాబు. నాలుగు రాష్ట్రాల్లో కొత్త రకం వైరస్ తో ఈ ఏడాది మిర్చి పైరుకి నష్టం జరిగిందన్నారు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మిర్చిపై వైరస్ ప్రభావం ఉందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇండోనేషియా నుంచి ఈ వైరస్ వచ్చినట్లు బెంగుళూరు లో ఉన్న ఉద్యాన అధ్యయన కేంద్రం గుర్తించిందని అన్నారు. కాగా.. గుంటూరు జిల్లాలో గత మూడేళ్లుగా మిర్చికి మంచి ధరలు రావడం వల్ల ఈ యేడాది ఎక్కువుగా మిర్చి సాగు చేశారని, అయితే 2.40లక్షల ఏకరాల్లో మిర్చి సాగు చేయగా అధిక వర్షాలు, వైరస్ వల్ల కొంత నష్టం జరిగిందని తెలిపారు మంత్రి కన్నబాబు. Minister Kannababu

Leave Your Comments

మల్టీ స్పెక్టల్ డ్రోనును ప్రారంభించిన ప్రవీణ్ రావు

Previous article

దీని ధర తెలిస్తే షాక్ అవుతారు..

Next article

You may also like