AP Agri Minister Kannababu: రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిసిసిబిలతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ… సీఎం జగన్ మోహన్ రెడ్డి సహకార శాఖలో ఎన్నో సంస్కరణలు చేపడుతున్నారని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నష్టాల్లో వున్న డిసిసిబిలను లాభాల బాటలో పెట్టామన్నారు. రాష్ట్ర వ్యవసాయ సహకార రంగాల అభివృద్ధికి సీఎం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని కన్నబాబు అన్నారు. నాబార్డ్ వారి nabcon సంస్థ ద్వారా సహకార రంగాన్ని ప్రక్షాళన ప్రారంభించామని, మన రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి నాబార్డు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వినియోగదాలకు చేరువయ్యేలా బ్యాంకుల అభివృద్ధి కోసం వినూత్నముగా ఆలోచనలు చేయాలని మంత్రి సూచించారు. రుణాలు ఇచ్చేప్పుడు, తిరిగి చెల్లించెటప్పుడు ఎటువంటి వత్తిడిలకు తలొగ్గకుండా పని చేయాలనీ సీఎం జగన్ చెప్పారని మంత్రి అన్నారు.
Also Read: వెల్లుల్లి సాగులో సస్యరక్షణ చర్యలు.!
ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ గోవిందా రాజులు పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహకార రంగాభివృద్దికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా సమ్మతిస్తున్నామని అయన తెలిపారు. అప్కోబ్ మరియు పాక్స్ లో మానవ వనరుల పాలసీలను పకడ్బందీగా అమలు చేయాలని, రాష్టంలో డిసిసిబిల బ్యాంకుల పనితీరు సంతృప్తిగా ఉందని చెప్పారు.కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కృషి చేయాలి. ప్రొపెర్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ప్రోకుర్మెంట్, వాల్యూ ఆడిషన్ ఇన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ రుణాలు , స్వయం సహాయక గ్రూపులు, జాయింట్ లయబుల్ గ్రూపులు , కౌలు రైతులకు రుణాలను పెంచాలన్నారు.
పాక్స్ అభివృద్ధి చేయాలంటే పారదర్శకత అంత్యంత అవసరమని, పాక్స్ కంప్యూటరీకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి కన్నబాబు తెలిపారు. అప్కోబ్ కు 100 కోట్లు , 9 డీసీసీబీలకు 195 కోట్లు షేర్ కాపిటల్ సీఎం జగన్ ప్రకటించినట్లు కన్నబాబు తెలిపారు. షేర్ కాపిటల్ 295 కోట్ల మొత్తాన్ని లోన్ ఇచ్చేందుకు అంగీకరించిన నాబార్డుకు కృతజ్ఞతలు తెలిపారు. పాక్స్ మరియు ఆర్బికే లను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలి. రుణాలు రికవరీ పక్కాగా చేసేలా చర్యలు తీసుకోవాలి. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా కో ఆపరేటివ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి , అప్కోబ్ చైర్మన్ మల్లెల జాన్సీ రాణి , ఆర్సిఎస్ అహ్మద్ బాబు, అప్కోబ్ ఎండి శ్రీనాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: కొబ్బరిసాగులో దూసుకెళ్తున్న ఆదర్శ రైతు మహిళా