Medical Education: ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా వనపర్తి వైద్యకళాశాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది కళాశాలల వర్చువల్ ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తిలకించారు. ప్రజల వద్దకే వైద్యం అందుబాటులో వైద్యవిద్య ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Singireddy Niranjan Reddy
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఒకేసారి ఎనిమిది వైద్యకళాశాలల తరగతుల ప్రారంభం దేశ చరిత్రలో నూతన అధ్యాయం. రాబోయేకాలంలో హైదరాబాద్ లో అందే వైద్యసేవలు జిల్లా కేంద్రాలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి చెప్పారు.
Also Read: Acharya N.G. Ranga Agricultural University: డ్రోన్ల వినియోగంలో శిక్షణకు పరస్పర సహాయ సహాకారాలు.!
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, నూతనంగా రాష్ట్రంలో 100 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అని, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలతో అందుబాటులోకి వైద్యుల సేవలు రావాలని మంత్రి నిరంజన్రెడ్డి ఆకాంక్షించారు.
స్వాతంత్ర్య వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండడం దురదృష్టకరం. కేసీఆర్ కిట్ తో సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహం కల్పించారు. అమ్మవడితో ఆడబిడ్డలు, శిశువుల ఆరోగ్యానికి భరోసా ముఖ్య మంత్రి కేసీఆర్ కల్పించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరధ పథకం కింద ప్రజలందరికీ సురక్షిత తాగునీరు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి తార్కాణం అని మంత్రి పేర్కొన్నారు.

Medical Education
వనపర్తిలో వైద్య కళాశాల తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో మంత్రి గారికి మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ నిజాంపాష, జోగుళాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల్ విష్ణువర్దన్ రెడ్డి, జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల కమిటీ చైర్మన్ మెంటెపల్లి పురుషోత్తం రెడ్డి, జడ్పీటీసీ భీమయ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
Also Watch: