Eruvaaka Foundation 2023-24 Telangana: ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్సిటి సహకారంతో జరిగిన కిసాన్ మహోత్సవం 2023-24 మరియు ఏరువాక పౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు -2023, తెలంగాణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలో కృషిని గుర్తించి, తదుపరి ప్రయత్నాలను ప్రేరేపించడానికి ఏరువాక ఫౌండేషన్ వివిధ విభాగాలలో ప్రతిష్టాత్మకమైన ఏరువాక వ్యవసాయ వార్షిక అవార్డులను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యవసాయ కళాశాలలు మరియు వాటి అనుబంధ విభాగాలలో, వ్యవసాయ కంపెనీలు, కెవికెలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పాత్రికేయులు, అగ్రి యాప్స్, సామాజిక మాధ్యమాల నిర్వాహకులు మరియు సృజనాత్మక రైతుల యొక్క విశిష్టమైన సేవలను ఏరువాక ఫౌండేషన్ గుర్తించి ఈ అవార్డులను అందించింది. ఏరువాక ఫౌండేషన్ రైతు సాధికారత కోసం ‘‘ఏరువాక వ్యవసాయ మాసపత్రిక’’ ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ సమాజానికి, అనుబంధ రంగాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది.
స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటి, దూలపల్లి, హైదరబాద్‌లో జనవరి 20,21 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన కిసాన్ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు తెలంగాణ, ఏరువాక అవార్డులు`2023 ప్రధానోత్సవ కార్యక్రమంతో పాటు ఎగ్జిబిషన్లో పలు వ్యవసాయ రంగ సంస్థలు, అగ్రికల్చర్ విద్యార్థులు రూపకల్పన చేసిన పరికరాలను, ఉత్పత్తులను ప్రదర్శించారు. రైతుల అవగాహాన కోసం సేంద్రియ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అంశాలపై నిపుణులచే సెమినార్లు, చర్చావేదికలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పద్మ శ్రీ చింతల వెంకట రెడ్డి గారితో పాటు ప్రీతి రెడ్డి, డైరెక్టర్, మల్లారెడ్డి యూనివర్సిటి, డా.వి.ఎస్.కె రెడ్డి, వైస్ ఛాన్సలర్, మల్లారెడ్డి యూనివర్సిటి, డా.ఎ రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్, మల్లారెడ్డి యూనివర్సిటి, డా.జలపతి రావు, రిటైర్డె ప్రొఫెసర్, డా. ఎ వీరభద్రరావు, అధ్యక్ష్యులు, అగ్రి హార్టికల్చర్ సొసైటి, సూర్యకళ, ప్రసిడెంట్, గ్రామభారతి, యం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు, జనరల్ సెక్రటరీ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సరోజ, అడ్మిన్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్, మహ్మద్ అలీ, మేనేజింగ్ డైరెక్టర్, నవరత్న క్రాప్ సైన్సెస్ ప్రై.లి., ఎండీ సుభాష్, విశ్వ అగ్రిటెక్లు పాల్గొన్నారు.
సేంద్రీయ, సహజ, గో ఆధారిత వ్యవసాయం ప్రాముఖ్యత అంశంపై గ్రామ భారతి అధ్యక్ష్యురాలు సూర్యకళ, పద్మారెడ్డి గార్లతో చర్చా కార్యక్రమంతో పాటు బయెఫెర్టిలైజర్లో ఇటీవల వస్తున్న మార్పులు వాటి ప్రయోజనాలపై జరిగిన చర్చలో భాగంగా హోమీయో విధానంలో పంటల సాగు విధానాలపై అమేయా కృషి వికాస కేంద్రం స్థాపకులు, ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాల్ రెడ్డి వివరించారు. కెవికె శాస్త్రవేత్త శ్రీనివాసరావు, డా. మాధవిలు పాల్గొని కషాయాలు, జీవన ఎరువులపై చర్చించారు. చర్చా వేదికను జనరల్ సెక్రటరీ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సుబ్రహ్మణ్యం రాజు మోడరేట్ చేసారు.
రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా టెర్రస్ గార్డెనర్ లలో ఉత్తమంగా సాగు చేస్తున్న వారికి ఏరువాక అవార్డులను అందించింది. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సభ్యులు పాల్గొని తమ సాగు అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సీటీజీ ప్రత్యేక స్టాల్‌ని ఏర్పాటు చేసి విభిన్న రకాల మొక్కలను సభ్యులకు ఉచితంగా అందించారు.
డా. డి. చక్రపాణి, ఎడిహెచ్, హార్టికల్చర్ మరియు సెరికల్చర్ అధికారి, వికారాబాద్ జిల్లా, ఎఫ్‌పిఒ సమున్నతి స్మార్ట్ అగ్రీ ఇన్ పుట్స్ హెడ్ మెండు శ్రీనివాసులు, దీప్తిసునీల్, డిజిఎం నాబార్డు, తెలంగాణ, అగ్రిఘర్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్ డా.సౌమినీ సుంఖర, ఏరువాక పౌండేషన్ వ్యవస్థాపకులు గారా రాఘవరావు పాల్గొని డిజిటల్ మరియు ఎఫ్‌పిఒల నిర్మాణం వాటి ప్రయోజనాలపై చర్చించారు.
ప్రకృతి వనం ప్రసాద్ గారు కార్యక్రమంలో పాల్గొని మన పర్యావరణంలో నేలను కాపాడుకుంటూ ఆరోగ్యవంతమైన చిరుధాన్యాల పంటల సాగు విధానాలు వాటి ఆవశ్యకతపై తమ ప్రసంగంలో వివరించారు.
ప్రీతి రెడ్డి, డైరెక్టర్, మల్లారెడ్డి యూనివర్సిటి :
అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశాలు సాంకేతికను వినియోగించుకుంటూ మట్టి లేకుండా తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ హైడ్రోపొనిక్స్ విధానంలో పంటలను సాగు చేస్తున్నాయని….అలాంటి సాగు విధానాలు మన దేశంలో కూడ అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని మల్లారెడ్డి యూనినర్సిటీ డైరెక్టర్ ప్రీతి రెడ్డి అన్నారు. మన దేశంలో విభిన్న రంగాలు అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ది చెందినప్పటికీ అందరికి ఆహారాన్ని అందించే వ్యవసాయ రంగం ఆవశ్యక్యత చాల గొప్పదని… అలాంటి వ్యవసాయ కోర్సులు తమ యూనివర్సిటీలో నిర్వహిస్తుండటం తమ యూనివర్సిటీకి గర్వ కారణమని తెలిపారు. ఏరువాక పౌండేషన్ ద్వారా రెండు రోజుల పాటు కిసాన్ మహోత్సవం ఏర్పాటు చేయటం వల్ల తమ వ్యవసాయ విద్యార్థులకు రైతులతో కలసి మరిన్ని కొత్త విషయాలను ఆచరణాత్మకంగా తెలుసుకోవటానికి మంచి అవకాశమని ప్రీతి రెడ్డి అన్నారు.
పద్మశ్రీ చింతల వెంకట రెడ్డి గారు :
ఏరువాక పౌండేషన్ ఆధ్వర్యంలో రైతులు, శాస్త్రవేత్తలు, అగ్రి జర్నలిస్టులు, అగ్రి విద్యార్థులకు ఏరువాక వార్షిక అవార్డులు ప్రకటించటం అందరికీి ప్రోత్సాహకరంగా వుంటుందని పద్మశ్రీ చింతల వెంకట రెడ్డి అన్నారు. ప్రస్తుతం సేంద్రీయ పంటలకు వాటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని ఆయన అన్నారు. ఎగ్జిబిషన్లో భాగంగా వ్యవసాయ విద్యార్థులు ప్రదర్శించిన అత్యాధునిక సాంకేతిక పరికరాలు రైతాంగానికి మరింత ఉపయోగకరంగా వుంటాయని అన్నారు. ముఖ్య అతిధిగా పాల్గొని ఏరువాక పౌండేషన్ నిర్వహించిన ఎగ్జిబిషన్‌ని చింతల వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
డా.వి.ఎస్.కె రెడ్డి, వైస్ ఛాన్సలర్, మల్లారెడ్డి యూనివర్సిటి
గతంలో కేవలం ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులకు మాత్రమే ఎక్కువ డిమాండ్ వుండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అన్ని రంగాలకు ప్రోత్సాహం లభిస్తుంది. అందులో అగ్రికల్చర్ కోర్సులకు మరింత డిమాండ్ పెరిగింది. ఈ వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ది చెందుతున్న కార్పోరేట్ వ్యవసాయంలో ముందుకు సాగితే అగ్రి విద్యార్థులకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి అవకాశాలున్నాయని మల్లారెడ్డి యూనివర్సిటి, వైస్ ఛాన్సలర్, డా.వి.ఎస్.కె రెడ్డి అన్నారు.
డా.ఎ రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటి
ఏరువాక పౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల కిసాన్ మహోత్సవం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు రైతులతో కలసి ఆచరణాత్మకంగా కొత్త విషయాల సమాచారాన్ని తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం ఉపయోగకరంగా వుంటుందంటూ కార్యక్రమ నిర్వహకులు ఏరువాకకు అభినందనలు తెలిపారు.2020 లో ప్రారంభించిన మల్లారెడ్డి యూనివర్సిటీలో విభిన్న కోర్సులను ప్రారంభించామని అందులో 1948 మంది అగ్రి విభాగం కోర్సులలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు వున్నారని తెలిపారు.
డా. ఎ వీరభద్రరావు, అధ్యక్ష్యులు, అగ్రి హార్టికల్చర్ సొసైటి,
వ్యవసాయ రంగానికి సంబంధించిన అగ్రి విద్యార్థులు, రైతులు, శాస్త్రవేత్తలు కలసి ఒకే వేదికగా ఏరువాక పౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్త విధానాలను తెలుసుకోవటంతో పాటు మారుతున్న వ్యవసాయ విధానాలను తెలుసుకోవటానికి అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
డా.జలపతి రావు, రిటైర్డ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ :
వ్యవసాయ రంగానికి సంబంధించిన విభిన్న అంశాలపై అవగాహాన కల్పించేందుకు ఏరువాక పౌండేషన్ కిసాన్ మహోత్సవం, ఏరువాక వార్షిక అవార్డుల ప్రధానోత్సవం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతాయి. ఇలాంటి కార్యక్రమాలు అన్ని అగ్రి యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని జలపతి రావు అన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహించేలా స్టాల్స్ ఏర్పాటు చేయటంతో పాటు ఈ ఎగ్జిబిషన్ లో మల్లా రెడ్డి యూనివర్సిటీ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.
దీప్తిసునీల్, డిజిఎం నాబార్డు, తెలంగాణ..
నాబార్డ్ సంస్థ తెలంగాణలో 375 ఎఫ్‌పిఒలకు సహాకారం అందిస్తోందని అందులో ఆదిలాబాద్ జిల్లా , ఇంద్రవెల్లిలో మోడల్ కాటన్ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు కాటన్ సీడ్ ఆయిల్ ఉత్పత్తులలో ఎఫ్‌పిఒల సభ్యులు విజయవంతంగా ముందుకు సాగుతున్నారని నాబార్డ్ డిజిఎం దీప్తిసునీల్ అన్నారు.
రూపినేని సరోజ్ కాంత్, సీటిజీ గ్రూప్ సలహాదారులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు
సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్ స్థాపకులు శ్రీనివాస రావు హర్కారా ఏర్పాటు చేసిన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్ గ్రూపు ఈ రోజు దేశ వ్యాప్తంగా 40 వేల మంది సభ్యులకు పైగా విస్తరించింది. కోవిడ్ సమయంలో మొదలైన వాట్సాప్ గ్రూప్ ఆలోచన ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకొని గ్రూప్ సభ్యులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ సాగు పై మెళకువలను అందిస్తుంది. టెర్రస్ గార్డెన్లో మొక్కలకు వచ్చే తెగుళ్ళు, పురుగుల నివారణకు బేకింగ్ సోడా వినియోగంతో విజయవంతం అయ్యిందని ప్రస్తుత్తం వ్యవసాయరంగంలో రైతులకు కూడ తమ సిటీజీ ద్వారా సలహాలు ఇవ్వగలుగుతున్నామని అన్నారు. సిటీజీ గ్రూపు కార్యక్రమాల నిర్వహణలో సరోజు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు.
మనోహరరావు, సీనియర్ అగ్రికల్చర్ ప్రొఫెసర్
మిద్దెతోటలను సాగు చేసుకుంటూ ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంటికి కావాల్సిన ఉత్పత్తులను పెంచుకోవటం వల్ల ఆరోగ్యంగా వుండగలుగుతామని.. వీటితో పాటు ప్రతి ఇంట్లో ఔషద మొక్కలను సాగు చేసుకుంటే మరింత మేలని సూచించారు. మార్కెట్లో లభించే కూరగాయలను ఉప్పు ద్రావణంలో వుంచి కడిగితే పంటలపై వుండే రసాయనాలను తినకుండా కొంత మేరకు తగ్గించుకోవచ్చని సీనియర్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ మనోహరరావు అన్నారు. టెర్రస్ పై స్వయంగా తయారు చేసుకున్న ట్రాప్స్ ఏర్పాటు చేసుకుంటే తక్కువ ఖర్చుతో పంటలకు పురుగులు ఆశించకుండా కాపాడుకునే అవకాశం వుంటుంది.
డా. డి. చక్రపాణి, హార్టికల్చర్ మరియు సెరీకల్చర్ విభాగం, వికారబాద్ జిల్లా
ప్రస్తుతం వెదురుకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో పాటు బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురు పెల్లెట్స్ కూడ తయారు చేస్తున్నారని డి. చక్రపాణి అన్నారు. రైతులకు ఉచితంగా జాతీయ వెదురు మిషన్ సంస్థ వెదురు మొక్కలను అందిస్తుందని ఇప్పటికే వికారాబాద్ హార్టికల్చర్ విభాగంలో 38 వేల మొక్కలను అందించామని రానున్న సంవత్సరంలో 70 వేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. మహిళలకు ప్రోత్సాహాన్నిఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న పథకాల ద్వారా రుణాలను అందించటంతో పాటు వారికి కావాల్సిన శిక్షణ కోసం వర్క్ షాప్ లను కూడ నిర్వహిస్తుందని డి. చక్రపాణి అన్నారు. మరిన్ని వివరాలకు …8374449345 నెంబర్ కి కాల్ చేయగలరని తెలిపారు.
ఎఫ్‌పిఒ సమున్నతి స్మార్ట్ అగ్రీ ఇన్ పుట్స్ హెడ్ మెండు శ్రీనివాసులు
సమున్నతి సంస్థ ద్వారా 5.500 ఖీూూ లకు సహకారం అందించటంతో పాటు డిజిటల్ సొల్యూషన్స్ సేవలను అందిస్తూ వారి స్ట్రాటప్ బిజినెస్‌లకు కావాలసిన ఇన్ ఫుట్స్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఖీూూ ద్వారా క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్ చేయటంతో పాటు స్మార్ట్ అగ్రి ఇన్ పుట్ల పాత్ర పై రైతులనుద్దిశించి ప్రసంగించారు.
గారా రాఘవ రావు, ఏరువాక ఫౌండేషన్ స్థాపకులు
వ్యవసాయ రంగ అభివృద్దిలో కృషి చేస్తున్న వారికి అవార్డులను అందించేందుకు నిస్పక్షపాతం ఆయా రంగ నిపుణులచే కమిటీని ఏర్పాటు చేసి అవార్డులను ప్రకటించామని ఏరువాక పౌండేషన్ స్థాపకులు రాఘవ రావు అన్నారు. అలాగే గత మూడు సంవత్సరాలుగా రైతులకు పరిశోధన ఫలితాలు, అధునాత పద్దతులను ఏరువాక మాసపత్రిక ద్వారా అందిస్తూ రైతు సాధికారతకు పాటు పడుతుందని తెలిపారు. ఎఫ్‌పిఒలకు కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని అందించటానికి డిజిటలైజేషన్ పద్దతిని అనుసరించటం వల్ల ఎఫ్‌పిఒల అభివృద్దికి తోడ్పడుతుందని ఇప్పుడున్న డిజిటల్ యుగంలో చాలా ప్రాముఖ్యమైన విషయమని ఏరువాక పౌండేషన్ స్థాపకులు రాఘవ రావు అన్నారు.
ఏరువాక ఫౌండేషన్ కిసాన్ మహోత్సవం 2023`24
వ్యవసాయ వార్షిక అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్
అగ్రి విద్యార్థులు రూపకల్పన చేసిన నూతన ఆవిష్కరణలు…ఆటోమేటెడ్ – నీటిపారుదల మరియు ఉష్ణోగ్రతను నియంత్రంచే గ్రీన్ హౌజ్ (పాలీ హౌజ్) నిర్మాణ ప్రక్రియ సీజన్లకు సంబంధం లేకుండా అన్ని రకాల పంటలను గ్రీన్ హౌజ్ మోటరింగ్ విధానంలో సంవత్సరం పొడవునా పండిరచుకునేలా ఈ పరికరాలను రూపకల్పన చేసి ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. నీరు మరియు ఉష్ణోగ్రతలను పంటలకు అనుగుణంగా మార్చుకునే విధానాన్ని వివరించారు.
` అర్జున్ సింగ్, అగ్రి స్టూడెంట్
ధాన్యంలో వచ్చే తెగుళ్ళను గుర్తించే యంత్రం
సాధారణంగా ధాన్యం లేదా ఆహార ఉత్పత్తులను గోదాములలో నిల్వ చేసే క్రమంలో అందులో ఉండే తేమ శాతంతో పాటు కలిగే మార్పులను గుర్తిస్తూ మనకు హెచ్చరించే పరికరాన్ని ఎగ్జిబిషన్లో అగ్రి విద్యార్థిని ప్రదర్శించింది.
– హిమబిందు
కలుపు మొక్కలను కత్తిరించే రోబో…..
పంటల సాగులో భాగంగా వచ్చే కలుపు నియంత్రణ రైతుకు అతి కీలకమైంది. అలాంటి ఈ కలుపు సమస్యను ఈ చిన్న రోబో యంత్రం ద్వారా నివారించడానికి అవకాశం వుంటుంది. వ్యవసాయ క్షేత్రంలో ఈ రోబో పని చేయటానికి ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా సోలార్ ప్యానెల్‌ని అమర్చారు. ప్రత్యేక చిప్‌లో సాప్ట్ వేర్ రూపకల్పన చేసిన సాప్ట్ వేర్ ఆధారంగా కలుపుని గుర్తించటంతో పాటు పూర్తిగా గడ్డిని కత్తిరిస్తుంది.
– కోమల్, విద్యార్థిని
నేల తేమను నమోదుని తెలుసుకుంటూ రిమోట్ యాక్సెస్‌తో పంటకు నీటిని అందించే ప్రక్రియ
వ్యవసాయ క్షేత్రంలో పంటకు కావాల్సిన నీటిని అందించేందుకు నేలలో ఉన్న తేమ శాతాన్ని సెన్సార్ ద్వారా తెలుసుకుంటూ ఆటోమేటెడ్ పసష్ట్రణతిలో నీటి పంపు ఆన్ అవుతుంది. ఆ తర్వాత నేలకు కావాల్సిన నీరు అందించిన క్రమంలో గుర్తించి ఆటోమేడెట్ పద్ద్దతిలో పంపు ఆఫ్ అవుతుంది. ఈ ప్రక్రియను మొబైల్ జీఎస్ఎమ్ సిమ్ పద్దతి ద్వారా మొబైల్ లో ఎక్కడినుండైనా కంట్రోల్ చేసుకునే అవకాశం వుంటుంది. దీని ద్వారా మేలైన పంట దిగుబడితో పాటు సమయం, డబ్బు, విద్యుత్ ఛార్జీలు, నీటి వృధాను తగ్గించటానికి అవకాశం వుంటుందని విద్యార్థులు తెలిపారు.
– వైష్మవి దేవి, నేహ, అనుష, తనుశ్రీ.. స్టూడెంట్స్
కోల్డ్ స్టోరేజీల్లో పాడైన ఉత్పత్తులను గుర్తించటం
శీతల గిడ్డంగులలో ఉత్పత్తులను ఎక్కువ కాలం భద్రపరుచుకునే క్రమంలో కొన్ని ఆహార ఉత్పత్తులు చెడిపోయే అవకాశం వుంటుంది. అలాంటి ఉత్పత్తులను వేగంగా గుర్తించ కలగితే వృధాను తగ్గించుకోవచ్చు. ఇందు కోసం ఉదాహరణకు ఉల్లిగడ్డల్లు చెడిపోయే క్రమంలో అందులో నుండి వెలువడే ఆల్కాహాల్, గ్యాస్ విడుదల ద్వారా చెడిపోయిన ఉల్లిగడ్డల్ని గుర్తించే క్రమంలో అలారం ద్వారా హెచ్చరిస్తుంది. దీనితో ఆ ప్రభావం మిగతా ఉత్పత్తులపై పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
– శ్రేయష్ వర్మ, హేమలిక.. స్టూడెంట్స్
అధిక వర్షాలతో పంట నష్టం జరగకుండా పంటను పూర్తిగా కవర్ చేస్తూ షీల్డ్ కవర్ వుంటుంది. మనిషి లేకుండానే అటోమేటేడ్ పద్దతిలో పరికరానికి అమర్చిన ఫ్లేట్ పై వర్షపు నీటి చుక్కల మోతాదును బట్టి వర్షాన్ని గుర్తిస్తూ షీల్డ్ కవర్ పంటను పూర్తిగా కప్పేస్తుంది. దీనిని అటోమేటెడ్ పద్దతితో పాటు ఎప్పటికప్పుడు మొబైల్‌కి కూడ సమాచారాన్ని అందించి పంటలను కాపాడుతుంది.
-ప్రదీప్, అక్షయ, సింధు