గ్రీన్హౌస్ లో తక్కువ వాటర్ తోనే, పెద్దగా ఎరువులు వాడకుండానే పంటలకు పండించొచ్చు. పంట దిగుబడి చాలా రేట్లు పెరుగుతుంది. కానీ, ఈ గ్రీన్ హౌస్ లను రైతులందరూ ఏర్పాటు చేసుకోలేరు. చిన్న రైతులకు కూడా గ్రీన్ హౌస్ లను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ఖేతి.
మాన్యుఫాక్చరింగ్, డిజైన్ కంపెనీలతో పార్టనర్షిప్ కుదుర్చుకొని రూ.లక్ష కంటే తక్కువకే గ్రీన్ హౌస్ కిట్లను అందిస్తోంది. వీటిని ఎకరాలో పదోవంతు ప్లేస్ లోనే ఏర్పాటు చేస్తోంది. గ్రీన్ హౌస్ లంటే మొక్కలు పెరగటానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేసే ఓ క్లోజ్డ్ రూమ్ టైప్. కంపెనీ తీసుకొచ్చిన “గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్” ను రాష్ట్రంలోని సుమారు 500 మందికి పైగా రైతులు వాడుతున్నారని ఖేతి చెబుతోంది. వీటిని ఏర్పాటు చేసుకున్న రైతులకు ఏ రకం విత్తనాలు, ఎరువులు వాడాలి వంటి సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపింది. ఆదాయం మరింత పెరుగుతుంది. హైదరాబాద్ కు 60 కి.మీ. దూరంలో వున్న నారాయణపూర్ గ్రామంలో ఖేతి ప్రయాణం స్టార్టయ్యిందని కంపెనీ ఫౌండర్ కే. కౌషిక్ అన్నారు. 2017 లో ప్రారంభమైన ఈ కంపెనీ చిన్న రైతుల ఆదాయం పెంచడంపైనే ఎక్కువ ఫోకస్ చేసిందని చెప్పారు. వెంకటేష్ అనే రైతు ఆయన భార్య లక్ష్మీ తమకున్న 1.8 ఎకరాలలో వరితో పాటు, కూరగాయలను పండించేవారు. కానీ, వారికి ఏడాదికి వచ్చే ఆదాయం రూ.30 వేలు కూడా ఉండేది కాదు. వేసవిలో బోర్లు ఎండిపోవడం వంటి కారణాలతో 1.8 ఎకరాలను పూర్తిగా వాడుకోలేకపోయే వారు అని ఓ అనుభవాన్ని కౌషిక్ గుర్తు చేశారు. గ్రీన్ హౌస్ లో నాణ్యమైన కూరగాయలను పెద్ద మొత్తంలో పండించే విధాన్ని వెంకటేష్ కు చూపించారు. ఓపెన్ ఫీల్డ్ లో వాటర్ కోసం బోర్లు గంటల కొద్దీ నడవాల్సి ఉంటుంది. కానీ గ్రీన్ హౌస్ లో బోర్లు కేవలం ఐదు నిమిషాలు నడిస్తే చాలు అని వివరించాం. తాను గ్రీన్ హౌస్ ను పెట్టుకోవడానికి రెడీ అయ్యాడు అని పేర్కొన్నారు. అప్పటికే గ్రీన్ హౌస్ కాస్ట్ ను రూ.5 లక్షలకు తగ్గించాం. ఇతర గ్రీన్ హౌస్ లతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ, వెంకటేష్ లాంటి రైతులకు ఇది చాలా ఎక్కువ. అందుకే వీటి ధరలను మరింత తగ్గించి, చిన్న రైతుల కోసం అందుబాటు ధరలోకి తీసుకురావాలనుకున్నామని కౌషిక్ పేర్కొన్నారు. గ్రీన్ హౌస్ ల డిజైన్లకు మార్పులు చేసి ధరలను తగ్గించగలిగామని చెప్పారు. ప్రస్తుతం 400 చదరపు మీటర్ల లో గ్రీన్ హౌస్ ను ఏర్పాటు చేయడానికి రూ. 80,000 ఖర్చవుతుందని, వీటిలో కీటకాలు, వేడి, అధిక వానల నుంచి పంటలను రక్షించుకునేందుకు పాలీఇథైలిన్ షీట్స్ ను ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. సాధారణంగా ఇలాంటి టైప్ గ్రీన్ హౌస్ లను ఏర్పాటు చేయడానికి ఎకరాకు రూ. 25 లక్షలు ఖర్చవుతుందని ఈ రేటుతో పోలిస్తే తక్కువకే ఆఫర్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఖేతి ఫౌండర్ దార్లు కౌషిక్, సత్య రఘు.. ఒక ఎంటర్ ప్రెన్యూర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ లో కలిశారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లలోని చాలా మంది రైతులతో ఆరు నెలలు పాటు చర్చలు జరిపాక ఖేతి ని ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ ఫైనాన్స్ స్టార్టప్ సమున్నతి, బ్యాంక్ ఆఫ్ బరోడాలతో టై అప్ అయ్యి, రైతులకు లోన్స్ ఇప్పిస్తున్నామని కౌషిక్ అన్నారు. ఎటువంటి కొలేటరల్ లేకుండానే రైతులకు లోన్లిప్పించడం గొప్ప విషయమని అన్నారు. కానీ, లోన్ ప్రాసెస్ స్లోగా నడుస్తోందని పేర్కొన్నారు. అందుకే సరైన ఫైనాన్సింగ్ మోడల్ కోసం చూస్తున్నామన్నారు.
చిన్న రైతులకు గ్రీన్ హౌస్ లను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ఖేతి..
Leave Your Comments